Share News

రేషన్‌ షాపుల కోసం పోటీ

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:23 PM

జిల్లాలో రేషన్‌ షాపుల కోసం పోటీ పెరిగింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు అన్ని విషయాల్లో సముచితస్థానం కల్పిస్తున్నారు. ఈ

రేషన్‌ షాపుల కోసం పోటీ

జనసేన, బీజేపీ నేతల నుంచి కూడా ఒత్తిళ్లు

ఈసారి పాత డీలర్లకే రేషన్‌ కేటాయించే అవకాశం

ఒంగోలు (కలెక్టరేట్‌), జూన్‌ 23 : జిల్లాలో రేషన్‌ షాపుల కోసం పోటీ పెరిగింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు అన్ని విషయాల్లో సముచితస్థానం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ద్వితీయశ్రేణి నేతలతోపాటు జనసేన, బీజేపీ నాయకులు కూడా తమ అనుచరులకు రేషన్‌ షాపులను ఇప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో రేషన్‌షాపుల కోసం అధిక డిమాండ్‌ ఏర్పడటంతో ఇప్పటికిప్పుడు వాటిని కేటాయించే పరిస్థితి లేకుండాపోయింది. ఈనెల 20వతేదీ నుంచి రేషన్‌ షాపులకు పౌరసరఫరాల గిడ్డంగుల నుంచి నిత్యావసర సరుకులను సరఫరా ప్రారంభమైంది. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న డీలర్లకే ఈనెల సరుకుల పంపిణీ బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1,392 రేషన్‌షాపులు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల వారీగా షాపులు కేటాయించాలంటే స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సులు రావాల్సి ఉంది. పరిస్థితులకు అనుగుణంగా ఈ రేషన్‌ షాపులను కేటాయించాలి. ఇంకోవైపు ఎన్‌డీఏ కూటమిలో జనసేన, బీజేపీ కూడా ఉండటంతో వారితో కూడా నియోజకవర్గాల వారీగా చర్చించి తగు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీంతో రేషన్‌ షాపుల కేటాయింపులో జాప్యం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న డీలర్లకే నిత్యావసర వస్తువులను కేటాయింపు చేయనున్నట్లు తెలిసింది.

Updated Date - Jun 23 , 2024 | 11:23 PM