Share News

ఓటేసేందుకు వచ్చి..ప్రాణాలు వీడి

ABN , Publish Date - May 15 , 2024 | 11:28 PM

సొంతూరిపై మమకారం.. ఓటు వేయాలన్న దృఢ సంకల్పం.. పిల్లాజెల్లతో ఇంటిల్లిపాదీ సొంత ఊళ్లకు వచ్చారు. ఓటు హక్కును హక్కు బాధ్యతగా భావించి, ఓటేసి తిరిగి వెళ్తూ రోడ్డు ప్రమాదం లో దుర్మణం పాలయ్యారు. ఓటేసేందుకు సొం త ఊళ్లకు వచ్చి ఒక్కరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు.

ఓటేసేందుకు వచ్చి..ప్రాణాలు వీడి
బస్సులోని మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు

చిలకలూరిపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

టిప్పర్‌ను ఢీకొట్టి దగ్ధమైన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

నీలాయపాలెంవాసులు నలుగురు దుర్మరణం

వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

ఇద్దరు డ్రైవర్లు మృతి

పర్చూరు, మే 15 : సొంతూరిపై మమకారం.. ఓటు వేయాలన్న దృఢ సంకల్పం.. పిల్లాజెల్లతో ఇంటిల్లిపాదీ సొంత ఊళ్లకు వచ్చారు. ఓటు హక్కును హక్కు బాధ్యతగా భావించి, ఓటేసి తిరిగి వెళ్తూ రోడ్డు ప్రమాదం లో దుర్మణం పాలయ్యారు. ఓటేసేందుకు సొం త ఊళ్లకు వచ్చి ఒక్కరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. తిరిగి వారు ఉద్యోగ, వ్యాపారాలు చేసే ప్రాంతాలకు ప్రైవేట్‌ ట్రా వెల్స్‌ బస్సులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయా ణం అయ్యారు. అంతలోనే మృత్యువు కాటేసింది. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. చినగంజాం మం డలం నీలాయపాలెంకు చెందిన ఒకే కుటుంబంవాళ్లు కాశీ బ్రహ్మేశ్వరరావు (65), భార్య లక్ష్మి (60), మనవరాలు ఖ్యాతి (10సం), అదే మండలం గొనశపూడి గ్రామానికి చెందిన దా వులూరి శ్రీనివాసరావు (54) సజీవదహనమయ్యారు. నీలాయపాలెం గ్రామానికి చెందిన 10 మంది బస్సులో ప్రయాణిస్తుండగా, అం దులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడం విషాదకరం.

ఈసంఘటనలో ఇద్దరు డ్రైవర్‌లతో సహా బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనమయ్యారు. కళ్లు తెరిచేలోపే బస్సు కాలిబూడిదయింది. గాఢ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యా యి. క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానికులు అప్రమత్తమై 108, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మిన్నంటిన ఆర్తనాధాలు

అర్ధరాత్రి కారుచీకట్లో బస్సు అగ్నికి అహుతి కావడం అందులో ఉన్న ప్రయాణికులు అగ్నికి అహుతి అవుతూ చేసిన ఆర్తనాధాలు పలువురిని దిగ్భాంతికి గురిచేశాయి. అసలు ఏమి జరిగిందో ఎమీ జరగబోతుందో అర్థంకాని స్థితిలో ప్రాణాలతో బయట పడిన వారు తీవ్ర ఆందోళనకు గురిఅయ్యారు.

మాసంపు మద్దల్లా మృతదేహాలు

ఒక్కసారిగి బస్సు దగ్ధం కావడంతో అందులో ఉన్న ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బస్సులో మృతదేహాలు చల్లాచెదురుగా గుర్తించలేని స్థితిలో మాంసం ముద్దల్లా మారాయి. ఎవరి మృతదేహం అనేది గుర్తిచలేని స్థితి నెలకొంది.

కంటతడి పెట్టించిన ప్రమాదం

ఘటనా స్థలంలో బస్సులో మృతి చెంది చె ల్లాచదురుగా మాంసం మద్దల్లా పడిఉన్న మృతదేహాలు చూపరులను కంటతడి పెట్టించాయి. బంధువుల రోదనలు మిన్నంటాయి.

బస్‌ ప్రమాదంలో చీరాలవాసి దుర్మరణం

మరో 15 రోజుల్లో కుమార్తె నిశ్చితార్థం..ఈలోపే ఘటన

ప్రమాదం జరిగిన సుమారు

10 గంటల తరువాత కుటుంబ సభ్యులకు సమాచారం

పెద్ద దిక్కును కోల్పోయి బోరున విలపిస్తున్న కుటుంబం

రాలేనని చెప్పినా ట్రావెల్స్‌ వారు బలవంతంగా తీసుకెళ్లారని బంధువులు ఆరోపణ

చీరాలటౌన్‌, మే15 : చిలకలూరి పేట వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చీరాల సమీపంలోని పేరాలకు చెందిన షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌(45) దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం షరీఫ్‌ సుమారుగా 25 సంవత్సరాలుగా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. కొంత కాలంగా చీరాల్లోని ఓ ప్రైవేటు బస్‌కు కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి భార్య నజ్మా, కుమార్తె రిజ్వాన, కుమారుడు అబ్బాస్‌ సంతానం. అయితే కుమారుడిని చదివించే స్థోమత లేకపోవడంతో వెల్డింగ్‌ పనికి వెళుతున్నాడు. కమార్తెకు నూజివీడులో మంగళవారం సంబంధం కుదిరింది. ఈనెల 30న నిశ్చితార్థంకు మాట్లాడుకున్నారు. అయితే నూజివీడు నుంచి ప్రయాణం చేసి రాత్రికి ఇంటికి చేరారు. అయితే ట్రావెల్స్‌ యజమాని కచ్చితంగా బస్‌కు రావాల్సిందేనని తీసుకువెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ రాత్రి 10 గంటల తరువాత డ్యూటీకి వెళ్లిన తరువాత బుధవారం ఉదయం 10 గంటలకు సంఘటన స్థలం నుంచి ఫోన్‌ వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రమాదంలో షరీఫ్‌ మృతిచెందడంతో కు టుంబ సభ్యులు బోరున విపిస్తున్నారు. అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబా న్ని పోషించుకుంటున్న షరీఫ్‌ కుమార్తె వివాహం కూడా ఆగే పరిస్థితి ఉందని స్థానికులు విషాదం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 15 , 2024 | 11:28 PM