Share News

ప్రేమికుడి కోసం వచ్చి బలవన్మరణం

ABN , Publish Date - May 31 , 2024 | 12:08 AM

ప్రేమికుడి కోసం బెంగళూరు నుంచి చీ మకుర్తికి ఒంటరిగా వచ్చిన యువతి రెండురోజు ల పాటు సాగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌లో పురుగుమందు తాగి ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.

ప్రేమికుడి కోసం వచ్చి బలవన్మరణం

బెంగళూరు నుంచి చీమకుర్తి వచ్చిన యువతి

పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నం

రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి

ప్రశ్నార్థకంగా పోలీసుల వైఖరి

చీమకుర్తి, మే 30 : ప్రేమికుడి కోసం బెంగళూరు నుంచి చీ మకుర్తికి ఒంటరిగా వచ్చిన యువతి రెండురోజు ల పాటు సాగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌లో పురుగుమందు తాగి ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన చేతన్‌ గత కొన్నేళ్లుగా చీమకుర్తి ఇసుకవాగ ుసెంటర్‌ వద్ద బెంగళూరు బేకరిని నడుపుతున్నాడు. అతనికి భార్యాపిల్లలు ఉన్నారు. వీరందరూ ఇక్కడే నివాసం ఉంటున్నా రు. కాగా చేతన్‌ బెంగళూరుకు చెందిన పెళ్లికాని యువతి ఇంఫానాతో గత కొన్నేళ్లుగా గుట్టుగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. చేతన్‌ బెంగ ళూరుకు వెళ్లినపుడు వారు ఇద్దరు కలుసుకుంటు న్నారు. అయితే ఇటీవల ఇంఫానా తనను పెళ్లి చేసుకోవాలని చేతన్‌ను గట్టిగా పట్టుబట్టింది. దీ ంతో ఆ వ్యవహారం ముదిరి బెంగళూరు పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. అక్కడ పోలీసులు ఇద్దరి మ ధ్య రాజీ కుదిర్చి కొంత మొత్తాన్ని పరిహారంగా కూడా చేతన్‌ నుంచి ఇంఫానాకు ఇప్పించి కేసు క్లోజ్‌ చేశారు. కానీ ఆ కథ అంతటితో ముగియలే దు. మళ్లీ ఇద్దరి మధ్య ఫోన్‌ సంభాషణలు కొ నసాగుతున్నాయి. చివరికి ఇంఫానా ప్రేమించిన చేతన్‌ను విడిచి ఉండలేక ఎలాగైనా పెళ్లి చేసు కోవాలని ఒంటరిగానే చీమకుర్తికి బుధవారం వచ్చింది. ఇసుకవాగు సెంటర్‌లో ఉన్న చేతన్‌కు చెందిన బేకరిలో తిష్టవేసింది. తననూ పెళ్లి చే సుకుంటేనే ఇక్కడ నుంచి వెళ్తానని భీష్మించుకు కూర్చుంది. దీంతో చేతన్‌ తెలివిగా తన భార్యతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు. బేకరికి వచ్చిన యువతి న్యూసెన్స్‌ చేస్తుంది.. చర్యలు తీసుకోండి అని చేసిన ఫిర్యాదుకు పోలీసులు తక్షణమే స్పందించారు. బేకరికి వెళ్లి యువతిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ యువతి తా మిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమ వ్యవహారాన్ని వివరించింది. కానీ వారు ఈ విషయం బెం గళూరు పోలీస్‌స్టేషన్‌లోనే తేల్చుకో.. ఇక్కడ గొడవ చేయవద్దని తేల్చి చెప్పారు. దానికి యువతి ససేమిరా అనటంతో సీఐ గారు వస్తారు.. ఆయ నకు చెప్పుకో అని అక్కడ ఉన్న సిబ్బంది చెప్పి నట్లు తెలుస్తోంది. అయితే ఈలోపు స్టేషన్‌ ఆవ రణలోనే చేతన్‌, ఆయన భార్య, ఇంఫానాల మ ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ కేసును డీల్‌ చేస్తున్న సిబ్బంది వ్యవహరించిన ప్రశ్నార్థకమైన తీరుతోనో లేదా ఇక తనకు న్యాయం జరగదని భావించటం వలనో పురుగుమందు తాగింది. భో జనానికి అని బయటకు వెళ్లిన ఇంఫానా అర గంట తర్వాత స్టేషన్‌కు వచ్చి బల్లపై కూర్చుంది. ఒక్కసారిగా పక్కకు ఒరిగిపడటం, నోటిలో నుం చి నురగ వస్తుండటంతో పోలీసులు హుటాహు టిన స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అయితే అక్కడ యువతికి వైద్యసేవలు అందిస్తుండగా బుధవారం అర్ధరాత్రి మృతి చెందింది. కాగా ఒంటరిగా బెంగళూరు నుంచి చీమకుర్తికి వచ్చిన యువతి పట్ల పోలీసులు సానుకూల ధోరణితో వ్యవహరించి ఆమె తల్లిదండ్రులకు తెలపటం లాంటి ఫ్రెండ్లి పోలీసింగ్‌ చేసినట్లయితే యువతి క్షణికావేశానికి గురయ్యే అవకాశం ఉండేది కా దేమో అని పలువురు భావిస్తున్నారు. ఈ ఘట నపై సీఐ దుర్గాప్రసాద్‌ స్పందిస్తూ ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశామని, పూర్తిస్తాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. అయితే స్టేషన్‌లో ఆమె పురుగుమందు తాగలేదని చెప్పారు. కానీ ఆమె స్టేషన్‌ ఆవరణలోనే తాగి లోపలికి వ చ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - May 31 , 2024 | 12:08 AM