ఓట్ల తొలగింపునకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి
ABN , Publish Date - Feb 06 , 2024 | 10:24 PM
ఓట్ల జా బితా ప్రకటించిన తరువాత ఏఒక్క ఓటు తొలగొంచాలన్న కలెక్టర్ అను మతి తప్పనిసరిగా తీసుకోవాలని ప ర్చూరు నియోజకవర్గ ఓటర్ల నమో దు అధికారి కె.వెంకటేశ్వర్లు అన్నారు.
ఈఆర్వో వెంకటేశ్వర్లు
పర్చూరు, ఫిబ్రవరి 6: ఓట్ల జా బితా ప్రకటించిన తరువాత ఏఒక్క ఓటు తొలగొంచాలన్న కలెక్టర్ అను మతి తప్పనిసరిగా తీసుకోవాలని ప ర్చూరు నియోజకవర్గ ఓటర్ల నమో దు అధికారి కె.వెంకటేశ్వర్లు అన్నారు. పర్చూరు నియోజకవర్గ ఎన్నికల అ ధికారిగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు మంగళవారం స్థానిక ఐసీ డీఎస్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులు, సెక్టోరియల్ పోలీసు అధికారులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను సమ ర్ధవంతంగా నిర్వహించేవిధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించా లన్నారు. ఓట్లు తొలగింపు విషయం లో మొత్తం నియోజకవర్గంలోని ఓ ట్లలో 0.1 శాతం దాటితో సీఈవో అ నుమతి తీసుకోవాలన్నారు. పరిధికి లోబడి ఉన్న ఓట్ల తొలగింపునకు కలె క్టర్ అనుమతితో తొలగిస్తామన్నారు. పోలీసు అధికారులతో జరిగిన సమా వేశంలో ఆయా మండలాల పరిధిలో సమస్యాత్మక గ్రామాల వివరాలు, పో లింగ్ బూత్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సెక్టోరియల్ అధికారి వారి పరిధిలోని పోలింగ్ బూత్‌లపై సమగ్ర సమాచారంతో ఉం డాలన్నారు.
కార్యక్రమంలో ఆయా మండలాల రెవె న్యూ అధికారులు, పోలీసుల అధికారులు పాల్గొన్నారు.