Share News

అంగన్‌వాడీల కోటి సంతకాల సేకరణ

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:24 AM

డిమాండ్ల సాధన కోసం 33 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు శనివారం కోటి సంతకాల సేకరణ చేపట్టారు.

అంగన్‌వాడీల కోటి సంతకాల సేకరణ
ఒంగోలులో సంతకం పెడుతూ నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు

దీక్ష శిబిరం వద్ద వర్కర్లను దూషించిన వ్యక్తి

అతనిపై టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

ఒంగోలు నగరం, జనవరి 13 : డిమాండ్ల సాధన కోసం 33 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు శనివారం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. స్థానిక కలెక్టరేట్‌ ఎదుట శనివారం ఉదయం ఈ కార్యక్రమాన్ని అంగ న్‌వాడీలు ప్రారంభించారు. ఒకవైపు నిరవధిక దీక్షలను కొనసాగిస్తూనే ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో సంతకాల సేకరణ చేపట్టారు. కాగా జిల్లావ్యాప్తం గా సంతకాల సేకరణతోపాటు వివిధ రూపాల్లో తమ నిరసనను తెలిపారు. మానవహారాలు, ధర్నాలు, దీక్షలు, వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులో దీక్షలను సీఐటీయూ నాయకుడు పారా శ్రీనివాసులు ప్రారంభించారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేందుకు ఏమాత్రం చొరవ చూపడం లేదన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమే ష్‌ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం చర్చల పేరుతో అంగన్‌వాడీలను అవమానిస్తున్నదన్నారు.

కార్యకర్తలను దుర్భాషలాడిన వ్యక్తిపై ఫిర్యాదు

అంగన్‌వాడీలు కలెక్టరేట్‌ వద్ద నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్దకు గుర్తుతెలియని వ్యక్తి వచ్చి వారిని దుర్భాషలాడాడు. వేతనాల కోసం ఆందో ళన చేస్తున్న వారిని అవమానకరంగా మాట్లాడాడు. దీంతో అంగన్‌వాడీలు అతనిపై టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు రక్ష ణ కావాలంటూ పోలీసులను కోరారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను అకారణంగా దర్భాషలాడిన వ్యక్తిని శిక్షించాలని వారు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో అన్నపూర్ణ, సంధ్య, సుబ్బమ్మ, ప్రశాంతి, హెమేమా పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 01:24 AM