సీఎం సహాయ నిధి.. పేదలకు పెన్నిధి
ABN , Publish Date - Oct 28 , 2024 | 12:05 AM
సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని ఎ మ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. మండల పరిధిలోని జాండ్రపేటలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఆదివారం ఎమ్మె ల్యే కొండయ్య చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు.
చెక్కుల అందజేతలో
ఎమ్మెల్యే కొండయ్య
చీరాల, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని ఎ మ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. మండల పరిధిలోని జాండ్రపేటలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఆదివారం ఎమ్మె ల్యే కొండయ్య చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పేరాలకు చెందిన చెంచు ప్ర సాద్‌కు రూ.1.06 లక్షలు, పందిళ్లపల్లికి చెం దిన శివకుమారికి రూ.1.88 లక్షలు రావూరిపేటకు చెందిన మీరాకుమారికి రూ.1.48 లక్ష లు, పుల్లరిపాలెంకు చెందిన రామచంద్రరావుకు రూ.62 వేలు, సాల్మన్ సెంటర్ పంచాయతీకి చెందిన జయకృష్ణకు రూ.1.06లక్షలు చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య అందజేశారు. చెక్కులు అందుకున్న వారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే కొండయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
సభ్యత్వంతో ఎంతో ఉపయోగం
టీడీపీ సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికీ ఎన్నో ప్రయోజనాలు సమకూరుతాయని ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు. ఆదివారం జాండ్రపేటలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు, నీటి సంఘాలు, సొసైటీలు తదితరాల్లో పోటీల్లో నిలిచే వారు క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవాలన్నారు. ప్రమాద బీమాకు రూ.5లక్షలు, సహజ మరణానికి మట్టి ఖర్చులకు ఇతరత్రా ప్రయోజనాలను వివరించారు. సభ్యత్వాల చేర్పుల్లో పార్టీల శ్రేణులు క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.