Share News

20న ఒంగోలుకు సీఎం జగన్‌ రాక

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:29 AM

ఒంగోలు న గరంలోని అర్హులైన పేదలకు ఈనెల 20వతేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తీసు కోవాల్సిన భద్రత ఏర్పాట్లు, పట్టాల పంపిణీకి తీసు కోవాల్సిన చర్యలపై శుక్రవారం ఎన్‌.అగ్రహరంలోని లేఅవుట్‌లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు.

 20న ఒంగోలుకు సీఎం జగన్‌ రాక

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, ఎమ్మెల్యే, ఎస్పీ

అధికారులతో సమీక్ష

అగ్రహారంలో స్థలాల లేఅవుట్‌ పరిశీలన

ఒంగోలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 16: ఒంగోలు న గరంలోని అర్హులైన పేదలకు ఈనెల 20వతేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తీసు కోవాల్సిన భద్రత ఏర్పాట్లు, పట్టాల పంపిణీకి తీసు కోవాల్సిన చర్యలపై శుక్రవారం ఎన్‌.అగ్రహరంలోని లేఅవుట్‌లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు. అక్కడ జ రుగుతున్న పనులను పరిశీలించడంతో పాటు పట్టా ల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన లేఅవుట్‌ మ్యా పులను పరిశీలించారు. సంబంధితశాఖల అధికారు లతో సమావేశమయ్యారు. అనంతరం అక్కడ ఏ ర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కలెక్టర్‌ దినే ష్‌కుమార్‌ మాట్లాడుతూ ఒంగోలులోని పేదలకు పట్టాలు పంపిణీ చేసేందుకు ఈనెల 20న సీఎం వ స్తున్నారని తెలిపారు. పేదలకు పట్టాలు పంపిణీ చే సేందుకు అవసరమైన భూ సేకరణకు, లే అవుట్‌లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.231కోట్లు మం జూరు చేసిందన్నారు. ఎన్‌.అగ్రహారం, మల్లేశ్వరపు రం, వెంగముక్కలపాలెం, యరజర్లలో 540 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 460 ఎకరాలు భూసేకరణ చేసినట్లు తెలిపారు. మరో 60 ఎకరాలను భూసేకరణ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. లే అవుట్‌లో పట్టాలు పంపిణీ చేసేందుకు ప్లాట్ల ఏర్పాటుతో పాటు రోడ్లు, డ్రైనేజీ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందు కు కూడా చర్యలు తీసుకున్నామన్నారు. 22వేల మందికి పట్టాలు పంపిణీతో పాటు 15వేల మంది కి హౌసింగ్‌ మంజూరు పత్రాలను కూడా సీఎం చేతుల మీదుగా అందిస్తారని పేర్కొన్నారు. అనం తరం సభా వేదిక, హెలిప్యాడ్‌ ప్రదేశం, పార్కింగ్‌ ప్రాంతాలు, సీఎం కాన్వాయ్‌ రూటు తదితర అంశా లను పరిశీలించారు. అనంతరం ఎస్పీ పరమేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. సంబంధిత శాఖల అధి కారులతో కలెక్టర్‌ సీఎం పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. కార్య క్రమంలో పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:29 AM