Share News

శిద్దాపై చెవిరెడ్డి ఒత్తిడి

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:11 AM

ఒంగోలు లోక్‌సభ పరిధిలో వైసీపీ అస మ్మతి నేతలను సరిచేసుకోవడం, వారిని పార్టీ మారకుండా కట్టడి చేసి లబ్ధిపొం దాలనే ముమ్మర ప్రయత్నాలకు వైసీపీ ఒంగోలు లోక్‌సభ అభ్యర్థి శ్రీకారం పలికారు.

శిద్దాపై చెవిరెడ్డి ఒత్తిడి
శిద్దా రాఘవరావు

ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ

పార్టీ మారతారనే అనుమానంతో హడావుడి

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఒంగోలు లోక్‌సభ పరిధిలో వైసీపీ అస మ్మతి నేతలను సరిచేసుకోవడం, వారిని పార్టీ మారకుండా కట్టడి చేసి లబ్ధిపొం దాలనే ముమ్మర ప్రయత్నాలకు వైసీపీ ఒంగోలు లోక్‌సభ అభ్యర్థి శ్రీకారం పలికారు. తొలుత మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఆపై కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, తాజాగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు విషయంలో ఆయన జోక్యం అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒంగోలు లోక్‌సభ స్థానంపై ముందుగానే దృష్టిపె ట్టిన ఆయన సీఎం జగన్మోహన్‌రెడ్డిని గుప్పిట్లో పెట్టుకొని సిటింగ్‌ ఎంపీ మాగుంటకు వ్యతిరేకంగా తెరవెనుక పావులు కదిపారు. అభ్యర్థుల ఎంపిక పూర్తయిన తర్వాత ఒంగోలు లోక్‌సభ పరిధిలో వైసీపీని వీడే నాయకులందరి చుట్టూ తిరగడం ప్రారంభించారు. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అలకపూనగా ఆయన్ను సీఎం జగన్‌ వద్దకు తీసుకెళ్లి నామినేటెడ్‌ పదవి ఇచ్చేవరకు వెంటపడ్డారు. ఆ తర్వాత కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం రావడంతో హైదరాబాద్‌ చుట్టూ తిరిగి ఆయన్ను పట్టుకొని జగన్‌ వద్దకు తీసుకె ళ్లారు. దానిని జగన్‌ పత్రికలో ఫొటోలతో ప్రచురించుకున్నారు. తాజాగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీలో చేరబో తున్నారని, ఆయనకు ఆపార్టీ దర్శి టికెట్‌ లభించే అవకాశం ఉందని, రేపోమాపో ఆయన చంద్రబాబును కలిసే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జగన్‌ను శిద్దా రాఘవరావు కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వైసీపీ లోక్‌సభ అభ్యర్థి చెవిరెడ్డే వ్యాపారపరమైన అంశాలతో శిద్దాను భయపెట్టి సీఎం వద్దకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ‘మళ్లీ మనదే అధికారం. మీకు మంచి పదవి వస్తుంది. పార్టీలో చురుగ్గా పనిచేయండి’ అని జగన్‌ చెప్పినట్లు ప్రచారం జరుగు తోంది. శిద్దా ఏ ఉద్దేశంతో జగన్‌ను కలిసి నా తెరవెనుక ఆయన వ్యాపారపరమైన అంశాల్లో భయపెట్టే క్రమంలోనే తంతు జరిగిందనే ప్రచారం ముమ్మరంగా ఉంది. శిద్దా సీఎంను కలిసేందుకు వెళ్లారని తెలిసిన వెనువెంటనే టీడీపీ దర్శి నియో జకవర్గంలో మరికొందరు నాయకుల పేర్లపై సర్వే ప్రారంభించింది. శిద్దా ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయం పక్కనపెడితే వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యవహారశైలిని మాత్రం రాజకీయ నాయకులు చీదరించుకుంటున్నారు.

Updated Date - Mar 27 , 2024 | 01:11 AM