Share News

జనసేన పార్టీ సభ్యత్వాల నమోదులో చీరాల ఫస్ట్‌

ABN , Publish Date - Jul 28 , 2024 | 10:55 PM

జనసేన పార్టీ నాల్గవ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు కొనసాగింది. జనసేన పార్టీ సెంట్రల్‌ ఆంధ్ర ప్రోగ్రామ్‌ కమిటీ కన్వీనర్‌, చీరాల నియోజకవర్గ సభ్యత్వ నమోదు పరిశీలకుడు ఆల అనిల్‌ 18వ తేదీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, వాడరేవు బస్టాండ్‌లో పార్టీ జెండాను ఎగురవేశారు.

జనసేన పార్టీ సభ్యత్వాల నమోదులో చీరాల ఫస్ట్‌

ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన పరిశీలకుడు అనిల్‌

చీరాల, జూలై 28 : జనసేన పార్టీ నాల్గవ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు కొనసాగింది. జనసేన పార్టీ సెంట్రల్‌ ఆంధ్ర ప్రోగ్రామ్‌ కమిటీ కన్వీనర్‌, చీరాల నియోజకవర్గ సభ్యత్వ నమోదు పరిశీలకుడు ఆల అనిల్‌ 18వ తేదీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, వాడరేవు బస్టాండ్‌లో పార్టీ జెండాను ఎగురవేశారు. అక్కడ నుంచి ఆయన దిశానిర్దేశం మేర కు పార్టీ శ్రేణులు సమిష్టి కృషితో నిర్ణీత కాలవ్యవధిలో సభ్యత్వ నమోదులో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆదివారంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసింది. అందిన సమాచారం మేరకు చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా 4,518 మంది సభ్యత్వాలు స్వీకరించారు. తరువాత రేపల్లె నియోజకవర్గంలో 3,514 మంది, పర్చూరు నియోజకవర్గంలో 3,334, వేమూరు నియోజకవర్గంలో 2,798, బాపట్ల నియోజకవర్గంలో 2,052, అద్దంకి నియోజవకర్గంలో 1,960 మంది సభ్యత్వాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చీరాల నియోజకవర్గంలో విస్తృతంగా కృషి చేసిన పార్టీ శ్రేణులకు పరిశీలకుడు ఆల అనిల్‌ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశంలో ఆయన మాటలే తమకు శిరోధార్యమన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సభ్యత్వాల నమోదు ముగిసిందని, అధిష్టానం మరికొంత సమయం కేటాయిస్తే ఇంకా అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పార్టీ శ్రేణులు తెలిపాయి.

Updated Date - Jul 28 , 2024 | 10:55 PM