Share News

చంద్రబాబుతేనే రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:17 PM

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే అన్నిప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని టీడీపీ కూటమి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండలంలోని పెదఅలవలపాడు, పీసీపల్లి, పెదయిర్లపాడు గ్రామాల్లో శుక్రవారం రాత్రి వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

చంద్రబాబుతేనే రాష్ట్రాభివృద్ధి
పీసీపల్లిలో ప్రచార రథంపై నుంచి మాట్లాడుతున్న మాగుంట, ఉగ్ర

- అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వెలుగొండను పూర్తిచేస్తాం

- పీసీపల్లిని ఆయకట్టు పరిధిలోకి చేరుస్తాం

- టీడీపీ కూటమి అభ్యర్థులు మాగుంట, ఉగ్ర

పీసీపల్లి, ఏప్రిల్‌ 26: చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే అన్నిప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని టీడీపీ కూటమి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండలంలోని పెదఅలవలపాడు, పీసీపల్లి, పెదయిర్లపాడు గ్రామాల్లో శుక్రవారం రాత్రి వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతమైన కనిగిరి నియోజకవర్గంలో గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ట్రిపుల్‌ఐటీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తే, జగన్మోహన్‌రెడ్డి ఒక్క ఇటుకైనా పెట్టి నిర్మాణం చేపట్టలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగానే ఆరు నెలల్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేయడంతో పాటు త్వరితగతిన ట్రిపుల్‌ఐటీ నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పారు. వెలుగొండ ఆయకట్టు పరిధిలో పీసీపల్లి మండలాన్ని కూడా చేరుస్తామన్నారు. డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల్లోనే నిమ్జ్‌ను ఏర్పాటుచేసి అభివృద్ధి చేస్తామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే పాలేటిపల్లి చెరువును నిర్మించినట్టు గుర్తుచేశారు. ఇటీవల దిగుమతై వచ్చిన కొంతమంది నాయకులు కనిగిరి ప్రారంతలో ఉన్న వైట్‌క్వార్జ్‌లపై అప్పుడే కన్నేశారన్నారు. కనిగిరి నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే స్థానికుడినైన తనకు, ఎంపీగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డిలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రమణయ్య, రహీముల్లా, నాగరాజు, వేమూరి రామయ్య, మాదిరెడ్డి కొండారెడ్డి, గడ్డం బాలసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

కూటమితోనే మైనారిటీల అభివృద్ధి

కనిగిరి అభ్యర్థి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

సంక్షేమ పథకాల కరపత్రాలు ఆవిష్కరణ

కనిగిరి, ఏప్రిల్‌ 26: ఎన్డీఏ కూటమితోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో శుక్రవారం మైనార్టీల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రవేశపెట్టనున్న పథకాల వివరాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ వైసీపీ పాలనలో మైనార్టీలు సంక్షేమానికి దూరమయ్యారన్నారు. ముస్లింల సంక్షేమానికి కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా పక్కదోవ పట్టించి వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ముస్లింల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలుచేసినట్టు గుర్తు చేశారు. పండుగలకు రంజాన్‌తోఫా వంటి పథకాలతో వారి ఇంట పండుగ వాతావరణాన్ని కల్పించిందన్నారు. మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా విదేశీ విద్యకు అవకాశం కల్పించి వారి ఆర్థిక పురోగతికి బాటలు వేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆదరించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ముస్లిం కుటుంబాలను ఆయన అభ్యర్థించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు రోషన్‌సంధాని, గుడిపాటి ఖాదర్‌, బారాయిమాం, షరీఫ్‌, ఖాదర్‌వలి, బడేబాయి, మిన్నూ, జానీ తదితరులు పాల్గొన్నారు.

వెలిగండ్లలో 16 కుటుంబాలు చేరిక

వెలిగండ్ల : వెలిగండ్ల మండలంలో వలసల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా 16 ఎస్సీ కుటుంబాలు కూటమి అభ్యర్థి డాక్టర్‌. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. రామలింగాపురం ఎస్సీ కాలనీకి చెందిన 12 కుటుంబాలు, మరపగుంట్ల పంచాయతీకి చెందిన 4 ఎస్సీ కుటుంబాలు కనిగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉగ్ర సమక్షంలో పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను రద్దుచేసి ఎస్సీల పొట్ట కొట్టిందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు కేలం ఇంద్రభూపాల్‌ రెడ్డి, కొండు భాస్కర్‌ రెడ్డి, గజ్జల భాస్కర్‌రెడ్డి, గజ్జల రామలక్ష్మణ, యడ్ల కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వైసీపీని వీడినమాజీ సర్పంచ్‌

సీఎ్‌స్‌పురం(పామూరు) : సీఎస్‌పురం మండలం చెన్నపునాయునిపలి మాజీ సర్పంచ్‌ చిట్టిబోయిన వెంకటేశ్వర్లు యాదవ్‌ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. శుక్రవారం కనిగిరిలోని క్యాంపు కార్యాలయంలో వెంకటేశ్వర్లు యాదవ్‌కు టీడీపీ కూటమి అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమలంలో మాజీ ఎంపీపీ టి .పెద అల్లురయ్య, ఎన్‌సీ మాలకొండయ్య, వెంట్రామరాజు, మన్నెపల్లి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:17 PM