Share News

భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:54 AM

పట్టణంలోని శ్రీరామనవమి వేడుకలు వాడవాడలా భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. బుధవారం పట్టాభి ప్రసన్న రామాలయాల లో ప్రత్యేక పూజలు, సీతారాముల కల్యాణాలు నిర్వహిం చారు.

భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు

మార్కాపురం వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 17: పట్టణంలోని శ్రీరామనవమి వేడుకలు వాడవాడలా భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. బుధవారం పట్టాభి ప్రసన్న రామాలయాల లో ప్రత్యేక పూజలు, సీతారాముల కల్యాణాలు నిర్వహిం చారు. జవహర్‌నగర్‌లోని లక్ష్మీనారాయణ స్వామి దేవాల యంలో సీతారాముల కల్యాణమహోత్సవం కమిటీ అధ్యక్షులు డాక్టర్‌ కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పాలెం చెంచయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. నెహ్రూబజార్‌ లోని శ్రీ షిరిడీసాయిబాబా మందిరంలో వసంత నవ రాత్రులు, శ్రీరామనవమి చందనోత్సవం నిర్వహించారు.

పెద్దదోర్నాల : శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా తిమ్మాపురంలోని సీతారామస్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రామయ్య స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఐనముక్కుల గ్రామంలోని శ్రీ పట్టాభిసీతారామ స్వామి దేవాలయంలో గ్రామకమిటీ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కాకర్ల ప్రసాద్‌ పర్యవేక్షణలో వేదపండితుల మంత్రాల మధ్య మంగళ వాయిద్యాలతో నిర్వహించిన జానకిరాముల కళ్యాణ వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొని తిలకించారు. అనంతరం వడపప్పు, పానకం ప్రసాదంగా పంపిణీ చేశారు. కార్యక్రమాలలో కమిటీ పెద్దలు బొగ్గరపు రమేష్‌, ఆర్‌ పుల్లారావు, పీ.సుబ్బారావు, పెరుమాళ్ల నాగేంద్రబాబు, దొడ్డా వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య, మండ్లా లక్ష్మయ్య, వెంకటసుబ్బయ్య, యక్కంటి వీరారెడ్డి, గొల్మారు శేఖర్‌రెడ్డి, చిట్యాల రామకృష్ణారెడ్డి, కోటిరెడ్డి, యక్కంటి వెంకరటేశ్వరరెడ్డి, జంగిలి పిచ్చయ్య, లింగారెడ్డి పాల్గొన్నారు.

త్రిపురాంతకం : శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలోని పాతరామాలయం, కోదండ రామాలయం, టి.చెర్లోపల్లిలోని వెంకటేశ్వరాలయాలతోపాటు అన్ని గ్రామాలలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి సీతారాముల కల్యాణం నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం పానకం, వడపప్పు పంపిణీ చేశారు. అన్నసముద్రం మెట్ట ఆంజనేయస్వామి ఆలయం, త్రిపురాంతకంలోని వై.పాలెం కూడలి వద్ద ఉన్న అభయాంజనేయస్వామి ఆలయం, వెల్లంపల్లిలో వీరాంజనేయ స్వామి ఆలయాల్లో శ్రీరామనవమి సందర్బంగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి పొంగళ్లు వండి స్వామివారికి నైవేద్యం సమర్పించారు.

పొదిలి : పట్టణంలో జూనియర్‌ కళాశాల వీధిలో నూతనంగా ప్రతిష్టించిన రామాలయంలో శ్రీరామనవమి సందర్బంగా ప్రత్యేకపూజలు చేశారు. వివిధ గ్రామాల్లో అంగరంగవైభవంగా రాములవారి కల్యాణం, పట్టాభిషేకం నిర్వహించారు. అనంతరం పానకం, వడపప్పు తీర్ధ ప్రసాదాలు పంచిపెట్టారు. దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

గిద్దలూరు : శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా గిద్దలూరులోని నరవరోడ్డులోని సీతారామ కల్యాణ మండపంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్‌ జె.వి.నారాయణ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడైన రాఘవరెడ్డిలు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కల్యాణ మహోత్సవంలో కూర్చుని పూజలు నిర్వహించారు. దేవాలయాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామశోభ యాత్ర నిర్వహించారు. వీహెచ్‌పీ, బీజేపీ ప్రతినిధులు మోటార్‌ సైకిళ్లపై జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని రామాలయం, పట్టాభిరామస్వామి దేవాలయం, శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం, సాయిబాబా దేవాలయా లలో అత్యంత వైభవంగా రాముల వారికి కళ్యాణ మహో త్సవం, పట్టాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. వేణుగోపాలస్వామి దేవాలయం, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణ మహోత్సవంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, సామూహిక పూజలను ఏర్పాటు చేశారు.

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

కంభం : కంభం, అర్థవీడు మండలాల్లోని గ్రామాల్లోని రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కంభం పట్టణంలోని పట్టాభి రామస్వామి దేవాలయం, కందులాపురం పంచాయతీ నెహ్రూనగర్‌లోని రామాలయం, లింగోజీపల్లి గ్రామంలోని ఉపదేశ రామస్వామి దేవాలయాల్లో సీతారాముల కళ్యాణ వేడుకలు జరిగాయి. ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి అంకురార్పణ, సహస్త్ర నామపూజ, మంత్రపుష్పం అనంతరం స్వామి వారి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం అనంతరం ఆయా దేవాలయాల్లో భక్తులకు అన్నదానం నిర్వహించారు.

Updated Date - Apr 18 , 2024 | 12:54 AM