Share News

ఏపీఈఏపీలో సత్తా

ABN , Publish Date - Jun 12 , 2024 | 01:34 AM

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్‌ (ఎంసెట్‌-24) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయదుందుభి మోగించారు.

ఏపీఈఏపీలో సత్తా

జిల్లా విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు

ఒంగోలు(విద్య), జూన్‌ 11 : ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్‌ (ఎంసెట్‌-24) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయదుందుభి మోగించారు. రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకు నుంచి 200 ర్యాంకు వరకు అత్యధిక మంది సాధించి సత్తాచాటారు. ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ విభాగానికి సంబంధించి ఇంజనీరింగ్‌ ఫార్మసీ కోర్సుల్లో జిల్లాలోని పుల్లలచెరువు మండలం అక్కపాలెం విద్యార్థి కొమిరిశెట్టి ప్రభాస్‌ రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. ఒంగోలు భాగ్యనగర్‌కు చెందిన షేక్‌ సూరజ్‌ 15వ ర్యాంకు, కనిగిరి కొత్తపేటకు చెందిన వీఎస్‌ఎస్‌ఆర్‌కే తేజస్‌రెడ్డి 26వ ర్యాంకు సాధించారు. కొనకనమిట్ల మండలం ఇరసలగుండం విద్యార్థి డి.శ్రీనివాసరెడ్డి 59వ ర్యాంకు, పర్చూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఎస్‌.చంద్రతేజ 64వ ర్యాంకు, దొనకొండకు చెందిన షేక్‌ సుహానా జాస్మిన్‌ 132వ ర్యాంకు, చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం ఇలపావులూరుకు చెందిన ఎస్‌.వెంకట అస్విత 134వ ర్యాంకు, కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన వి.వెంకట ఆకాష్‌రెడ్డి 146వ ర్యాంకు, త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామానికి చెందిన తంగిరాల మధుప్రియ 155వ ర్యాంకు, పొదిలికి చెందిన జీవీఎన్‌ఎస్‌ ఆర్య చరణ్‌ 229వ ర్యాంకులో నిలిచారు.

బైపీసీ విభాగంలో..

బైపీసీ విభాగంలో అగ్రికల్చర్‌, ఫార్మసీ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశా లకు కొండపి మండలం పెరిదేపికి చెందిన ముప్పరాజు వెంకటప్రదీప్‌ చంద్ర 38వ ర్యాంకు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన కె.ప్రీతి 72వ ర్యాంకు, దర్శి తిమ్మా యపాలెంకు చెందిన పి.లక్ష్మీప్రసన్న 73వ ర్యాంకు, మేదరమెట్లకు చెందిన బి.సాయిఆకాష్‌ 75వ ర్యాంకు, తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెంకు చెందిన గొల్లపూడి దివ్యశ్రీ 123వ ర్యాంకు, కొత్తపట్నం మండలం అల్లూరు కు చెందిన సి.హెచ్‌.సాయి సమజ్ఞ 186వ ర్యాంకు సాధించారు. ఒంగోలు గద్దలగుంటకు చెందిన ఆకాంక్ష 192, దర్శి మండలం పాపిరెడ్డి పాలెంకు చెందిన ఎం.అనూహ్యారెడ్డి 193వ ర్యాంకు, ఒంగోలుకు చెందిన వి.గౌతమ్‌ 210, ఒంగోలుకు చెందిన ఆర్‌.జయకిషోర్‌ 241వ ర్యాంకు సాధించారు.

Updated Date - Jun 12 , 2024 | 07:26 AM