Share News

తాగునీటి సమస్యను పరిష్కరించలేరా..?

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:39 AM

‘‘600 కుటుంబాలున్న గ్రామంలో ఏర్పడిన తాగునీటి సమస్యను ఏళ్లతరబడి పరిష్కరించలే కుండా ఉన్నారు. ప్రతి సమావేశంలో ప్రశ్నిస్తున్నా. ఇంతవ రకూ పరిష్కార మార్గం చూపించలేకపోయారు. ఫ్లోరిన్‌ సమస్యతో గ్రామస్థులు కిడ్నీ, తదితర వ్యాధులబారిన పడి విలవిలలాడిపోతున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్క రించండి’’ అంటూ కూనంనేనివారిపాలెంకు చెందిన ఎంపీ టీసీ వేమా అశ్వని పాలకవర్గం, అధికారులపై తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు.

తాగునీటి సమస్యను పరిష్కరించలేరా..?

మండల కౌన్సెల్‌ సమావేశంలో కేవీపాలెం ఎంపీటీసీ సభ్యురాలు అశ్వని ధ్వజం

దాటవేత వైఖరి అవలంబించిన పాలకవర్గం

చీమకుర్తి, జూలై 4: ‘‘600 కుటుంబాలున్న గ్రామంలో ఏర్పడిన తాగునీటి సమస్యను ఏళ్లతరబడి పరిష్కరించలే కుండా ఉన్నారు. ప్రతి సమావేశంలో ప్రశ్నిస్తున్నా. ఇంతవ రకూ పరిష్కార మార్గం చూపించలేకపోయారు. ఫ్లోరిన్‌ సమస్యతో గ్రామస్థులు కిడ్నీ, తదితర వ్యాధులబారిన పడి విలవిలలాడిపోతున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్క రించండి’’ అంటూ కూనంనేనివారిపాలెంకు చెందిన ఎంపీ టీసీ వేమా అశ్వని పాలకవర్గం, అధికారులపై తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు అధ్యక్షతన చీమకుర్తిలో మండలపరిషత్‌ కౌన్సెల్‌ సమా వేశం గురువారం జరిగింది. ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్‌పర్స న్‌ బూచేపల్లి వెంకాయమ్మ హాజరయ్యారు. అజెండా కూ డా లేని ఈ సమావేశంలో తొలుత శాఖలవారి సమీక్షా సమవేశాన్ని నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌పై సమీక్ష సం దర్భంగా ఎంపీటీసీ అశ్వని కూనంనేనివారిపాలెంలో నెలకొ న్న తాగునీటి సమస్యపై ప్రశ్నించారు. దీనిపై అధికారి నీళ్లు నములుతుండటంతో జడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు జోక్యం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య వా గ్వాదం చోటుచేసుకుంది. రామతీర్థం జలాశయానికి స మీపంగా ఉన్నా గ్రామానికి సాగర్‌జలాలు అందటం లేద ని అశ్వని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న నా యుడుచెరువును ఎన్‌ఆర్‌ఐ నల్లూరి వెంకటశేషయ్య సహకారంతో పరిశుభ్రం చేసినట్లు చెప్పారు. ఈ చెరువును మంచినీటి చెరువుగా గుర్తించి సాగర్‌జలాలుతో నింపితే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. రామతీర్థం నుం చి గ్రామానికి పైపులైన్‌ వేసినా ప్రయోజనం లేకుండా పోయిందని, కాబట్టి నాయుడు చెరువును సాగర్‌ జలా లతో నింపి గ్రామస్థుల దాహర్తిని తీర్చాలని డిమాండ్‌ చేశారు. చివరగా జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ప్రసంగించారు. చీమకుర్తి అభివృద్థికి జిల్లాపరిషత్‌ నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులును కో రారు. సమావేశంలో ఎంపీడీవో రాఘవేంద్ర, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:40 AM