ఈ దారిలో నడవగలరా ?
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:35 AM
తుఫాన్ వర్షాల వలన మురికి నీరంతా రోడ్లపైకి చేరుకుంటోంది.
గిద్దలూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : తుఫాన్ వర్షాల వలన మురికి నీరంతా రోడ్లపైకి చేరుకుంటోంది. అయితే డ్రైనేజీ వ్యవ స్థ బాగా ఉన్న వీధుల్లో మళ్లీ మురికినీరు కాలువల్లో కలిసి పోతుండగా పట్టణంలోని కోటగడ్డవీధిలో మాత్రం సరియైున డ్రైనేజీ లేక మురికినీరు అలాగే రోడ్డుపై నిలువ ఉండి బురదగా మారి దుర్వాసన వెదజల్లుతున్నది. ఈ రోడ్డుపై నడిచేందుకు వీలుకాని పరిస్థితి నెలకొన డంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. మున్సిపల్ అధికా రులు స్పందించి రోడ్డుపై అలాగే ఉన్న బురదలో ఉన్న మురికిని తొలగించాలని, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.