Share News

టీడీపీతోనే బీసీలకు ప్రత్యేక గుర్తింపు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:00 AM

స్వర్గీయ ఎన్టీఆర్‌ నాలుగు దశాబ్దాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని టీడీపీ కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. మండలంలోని ముప్పవరం గ్రామంలో పార్టీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

టీడీపీతోనే బీసీలకు ప్రత్యేక గుర్తింపు
వేదికపై అభివాదం చేస్తున్న కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కృష్ణప్రసాద్‌, గొట్టిపాటి, బీసీ నేతలు

జయహో బీసీలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి

పంగులూరు, ఏప్రిల్‌ 17 : స్వర్గీయ ఎన్టీఆర్‌ నాలుగు దశాబ్దాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని టీడీపీ కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. మండలంలోని ముప్పవరం గ్రామంలో పార్టీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాపట్ల పార్లమెంటరీ పార్టీ న్యాయ విభాగ అధ్యక్షుడు బత్తుల రామకోటయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొట్టిపాటి మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచే బడుగుబలహీనవర్గాల ప్రజలు అండగా ఉండగా, వారి అభ్యున్నతికి పార్టీ పాటుపడుతున్నదన్నారు. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వ పాలనలో బలహీనవర్గాలకు రక్షణతోపాటు సంక్షేమం ఉంటుందన్నారు. వైసీపీ పాలనలో బీసీలపై దాడులు పెరిగిన విషయం అందరికీ తెలుసునన్నారు. పార్టీ మారలేదన్న కారణంతోపాటు జగన్‌రెడ్డి పాలన వైఫల్యాలను ఎత్తిచూపిన 75 మంది బీసీ నేతలను హతమార్చారని గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పార్టీలకు మద్దతు ఇవ్వండి.. మీకు అండగా కూటమి ఉంటుందన్నారు. జగన్‌రెడ్డి బీసీలకు కార్పొరేషన్‌, చైర్మన్‌ పదవులిచ్చి కుర్చీలకే పరిమితం చేశారని గొట్టిపాటి అన్నారు. కార్యక్రమంలో కూటమి ఎంపీ అభ్యర్థి టి.కృష్ణప్రసాద్‌, అద్దంకి, సంతమాగులూరు మాజీ ఎంపీపీలు మన్నం ఏడుకొండలు, సన్నెబోయిన ఏడుకొండలు, బీసీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

టీడీపీకి మద్దతు తెలిపిన వైదన వైసీపీ నేతలు

బల్లికురవ : మండలంలోని వైదన గ్రామానికి కొందరు వైసీపీ నేతలు బుధవారం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను అయన స్వగృహంలో కలిసి మద్దతు తెలిపారు. వైదన గ్రామంలో వైసీపీలో ఉన్న గాలం శ్రీను, గాలం నిమ్మయ్య, కుంచపు శ్రీను, తోట సురేష్‌, ఆలకుంట శేషయ్య, షేక్‌ పెద భూడే, పంచాయతీ వార్డు మెంబరు నాగిపోగు చినబాబులు తమ అనచరులతో కలిసి రవికుమార్‌ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పోగుల చంద్రశేఖర్‌, చినమేడ ప్రసాద్‌, షేక్‌ చినభూడే, మెరబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సైకిల్‌ గుర్తుపై ఓటేసి గొట్టిపాటిని గెలిపించండి

అద్దంకిటౌన్‌, ఏప్రిల్‌ 17: ఎన్నికలల్లో సైకిల్‌ గుర్తుపై ఓటేసి టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ గెలిపించాలని జడ్పీటీసీ మాజీ సభ్యుడు సందిరెడ్డి శ్రీనివాసరావు కోరారు. బుధవారం పట్టణంలోని రెండవ వార్డులో సూపర్‌సిక్స్‌ పథకాల కరపత్రాలను ఇంటింటికీ తిరిగి పంచిపెట్టారు. గొట్టిపాటి నామినేషన్‌కు తరలివచ్చి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో 2వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:00 AM