Share News

టీడీపీలో చేరిన వలపర్ల బీసీ కుటుంబాలు

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:42 PM

మండలంలోని వలపర్ల గ్రామాంలోని 20 బీసీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారు గురువారం మండలంలోని ఏలూరి క్యాంప్‌ కార్యాలయంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాం బశివరావు సమక్షంలో పార్టీలో చేరారు. ఏలూరి వారికి కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

టీడీపీలో చేరిన వలపర్ల బీసీ కుటుంబాలు
ఏలూరి సమక్షంలో పార్టీలో చేరిన వలపర్ల బీసీ కుటుంబాలు

మార్టూరు, ఏప్రిల్‌ 18 : మండలంలోని వలపర్ల గ్రామాంలోని 20 బీసీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారు గురువారం మండలంలోని ఏలూరి క్యాంప్‌ కార్యాలయంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాం బశివరావు సమక్షంలో పార్టీలో చేరారు. ఏలూరి వారికి కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ వలపర్ల గ్రామంలో టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. సీసీ రోడ్లు, ము రుగు కాల్వలను నిర్మించినట్లు చెప్పారు. ఇకపై కూడా అభివృద్ధికి కృషి చేస్తానని ఏలూరి తెలిపారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఏలూరి కోరారు. చేరినవారిలో తన్నీరు శివ, తన్నీరు వెంకటేష్‌, తన్నీరు వెంకయ్య, గుంజి సాయి వెంకటే్‌ష, గుంజి పవన్‌, కుంచాల వీరాంజనేయులు, గుంజి సుబ్బారావు, తన్నీరు అనిల్‌, గుంజి ధన మూర్తి, లక్ష్మినారాయణ, తన్నీరు అంకమ్మ, కుంచాల వెంకటేష్‌, తన్నీరు ఆకాష్‌, తన్నీరు గురు ప్రసాద్‌ ఉన్నారు. కార్యక్రమంలో కంభం పాటి హనుమంతరావు, గుంటి వెంకటేశ్వర్లుషేక్‌ బషీర్‌ పాల్గొన్నారు.

వలపర్లలో పార్టీ కార్యాలయం ప్రారంభం

మండలంలోని వలపర్ల గ్రామంలో గురువారం టీ డీపీ కూటమి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బీసీ కాలనీలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావును, ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్‌ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కంభంపాటి హనుమంతరావు, షేక్‌ బషీర్‌, గుంటి వెంకటేశ్వర్లు, సుబ్బారావు, ఎస్‌ఏ సలాం, గుద్దంటి శంకర్‌, రమేష్‌ , మోహనరావు పాల్గొన్నారు.

ఏలూరి నామినేషనుకు తరలిరండి

టీడీపీ కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఈనెల 22వ తేదీన పర్చూరులో నామినేషన్‌ వేస్తున్నారని, ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావాలని శ్రేణులు కోరారు. గురువారం మార్టూరులో పాత సినిమా హాలు వెనుక కాలనీలో కార్యకర్తలు ఇంటింటి ప్ర చారం నిర్వహించారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి కూటమి ఎమ్మెల్యేగా ఏలూరిని, ఎంపీగా కృష్ణప్రసాద్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో టీడీపీ నా యకులు కామినేని జనార్దన్‌, షేక్‌ రజాక్‌, తాటి నాగేశ్వరరావు, శివనాగేశ్వరరావు, రమాదేవి, శేషుకుమారి, భూలక్ష్మి, శ్రీను, ఆంజనేయులు పాల్గొన్నారు.

ఏలూరి విజయాన్ని కాంక్షిస్తూ జోరుగా ప్రచారం

పర్చూరు : టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుపు కోసం ఎన్‌డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. పర్చూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ఏలూరి విజయం కోసం ప్రతిఒక్కరూ సహకరించాలని ప్రచారం చేస్తున్నారు. గురువారం పర్చూరులోని ప్రధాన వీధుల్లో ప్రచారం సాగింది. కార్యక్రమంలో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు అగ్నిగుండాల వెంకటకృష్ణారావు, కొల్లా శివరాం ప్రసాద్‌, కొండ్రగంటి శివనాగేశ్వరావు, తులసి శ్రీనివాసరావు, ఆకుల మధుబాబు, గడ్డిపాటి శ్రీనివాసరావు, మల్లాధి సురేష్‌, వడ్డెముక్కల అబ్రహాం, నలిగిల కిషోర్‌, మార్టూరు నాగరాజు, కొల్లా చౌదరి, పూరిమెట్ల జయమ్మ, ఊటుకూరి నిర్మల, సుబ్బమ్మ, జనసేనులు సందీప్‌ తేజ, దీర్ఘాల రమేష్‌, తులసి చంటి, అచ్చికోలు సతీష్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

చినగంజాం, సంతరావూరులో కూటమి ప్రచారం

చినగంజాం : చినగంజాం, సంతరావూరు గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావును సైకిల్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కూటమి శ్రేణులు గురువారం రాత్రి ప్రచారం నిర్వహించారు. సాయిబాబా ఆలయంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు చెరుకూరి రాఘవయ్య ఆధ్వర్యంలో, సంతరావూరు రామాలయంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మి ఆధ్వర్యంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో చినగంజాం గ్రామ సర్పంచ్‌ రాయని ఆత్మారావు, నాయకులు అబ్దుల్‌ కలాంఅజాద్‌, మోటుమర్రి రామసుబ్బారావు, సందు శ్రీనివాసరావు, టీ.జయరావు. చేవూరి రవణమ్మ, నరహరి శ్రీనివాసరావు, గంటా చెన్నయ్య, బెల్లంకొండ రమే్‌షబాబు, ఎం.పద్మావతి, షేక్‌ జిలాని, బాజీ అమీర్జాన్‌, సుభాని, రసూల్‌, పీ.శ్రీనివాసరావు, తుమ్మలపెంట చిన్నా, ఎం.రామాంజనేయులు, బడుగు సామ్యేలు, హుస్సేన్‌బాషా, జి.నరసింహారావు, సతీష్‌, సూరిబాబు, దుర్గారావు, జే.సంధ్యారాణి, కే.శ్యాంబాబు, బీజేపీ మండల అధ్యక్షుడు అమరా మోహన్‌రావు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:42 PM