Share News

మద్యం కోసం బారులు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:01 AM

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ నామినేషన్‌కు వచ్చేవారికి, గ్రామాల్లో మందుతాగే వారికి ఒక క్వార్టర్‌ మద్యం, తాగని వారైతే, రూ.200 నగదు పంపిణీ చేశారు.

మద్యం కోసం బారులు
ప్రభుత్వ మద్యంషాపు వద్ద బారులుదీరిన మందుబాబులు

ఎర్రగొండపాలెం, ఏప్రిల్‌ 24 : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ నామినేషన్‌కు వచ్చేవారికి, గ్రామాల్లో మందుతాగే వారికి ఒక క్వార్టర్‌ మద్యం, తాగని వారైతే, రూ.200 నగదు పంపిణీ చేశారు. రానుపోను వాహనాలు ఏర్పాటు, ఎర్రగొండపాలెంలో భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే ర్యాలీ కోసం వచ్చిన వారికి మద్యం చాలలేదు. దీంతో వారికి డబ్బులు ఇవ్వడంతో మందు కోసం ప్రభుత్వ మద్యం దుకాణాల ఎదుట క్యూకట్టారు. ఎర్రగొండపాలెంలో మూడు మద్యం దుకాణాల వద్ద ఉదయం 10 గంటల నుంచే మద్యం కోసం వైసీపీ కార్యకర్తలు కిక్కిరిసిపోయారు. ఆ దుకాణాల సమీపంలోనే వారు తాగడం గమనార్హం

Updated Date - Apr 25 , 2024 | 12:01 AM