Share News

అభ్యర్థులకు అండగా బంధుగణం

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:33 PM

జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కొండంత అండగా వారి కుటుంబ సభ్యులు నిలుస్తున్నారు. రాజకీయాలలో బంధువులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కీలక నేతలకు అండగా పనులు చక్కబెడుతుంటారు. సాధారణ సమయంలో అవి పరిమితంగానో లేక ఇళ్ల వద్దనో పరిమితం అవుతుంటాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ఇంచుమించు అందరూ అభ్యర్థుల తరఫున వారి కుటుంబసభ్యులు, బంధువులు అలాగే వారికి వెన్నంటి నిలిచి ప్రోత్సహించే ఆత్మీయులు అధికంగా భాగస్వామ్యులు అవుతున్నారు. కొందరు అభ్యర్థికి మద్దతుగా కార్యకర్తలు, ప్రత్యేకించి మహిళలతో ఆత్మీయ సమావేశాలు, ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తుండగా మరికొందరు క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా, వివిధ వర్గాల వారిని దగ్గరకు చేర్చడం, పార్టీలోని వివిధ స్థాయి నేతల మధ్య సమన్వయంతోపాటు పలు అంతర్గత అంశాలపై దృష్టిసారిస్తున్నారు.

అభ్యర్థులకు అండగా బంధుగణం
ఒంగోలులో జనార్దన్‌ తరఫున ప్రచారం చేస్తున్న ఆయన భార్య సత్యలత

టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న కుటుంబ సభ్యుల ప్రచారం

ఆత్మీయ సమావేశాలు,ఇంటింటా క్యాంపెయిన్‌ ఆపై అంతర్గత వ్యవహారాలు

సమన్వయంతో దూసుకెళ్తున్న వైనం

జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కొండంత అండగా వారి కుటుంబ సభ్యులు నిలుస్తున్నారు. రాజకీయాలలో బంధువులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కీలక నేతలకు అండగా పనులు చక్కబెడుతుంటారు. సాధారణ సమయంలో అవి పరిమితంగానో లేక ఇళ్ల వద్దనో పరిమితం అవుతుంటాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ఇంచుమించు అందరూ అభ్యర్థుల తరఫున వారి కుటుంబసభ్యులు, బంధువులు అలాగే వారికి వెన్నంటి నిలిచి ప్రోత్సహించే ఆత్మీయులు అధికంగా భాగస్వామ్యులు అవుతున్నారు. కొందరు అభ్యర్థికి మద్దతుగా కార్యకర్తలు, ప్రత్యేకించి మహిళలతో ఆత్మీయ సమావేశాలు, ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తుండగా మరికొందరు క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా, వివిధ వర్గాల వారిని దగ్గరకు చేర్చడం, పార్టీలోని వివిధ స్థాయి నేతల మధ్య సమన్వయంతోపాటు పలు అంతర్గత అంశాలపై దృష్టిసారిస్తున్నారు.

ఒంగోలు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): గతానికి భిన్నంగా ప్రతి ఇంటింకీ, ప్రతి ఓటరును విధిగా పలకరించక తప్పని పరిస్థితి ప్రస్తుత ఎన్నికలలో కనిపిస్తోంది. దీంతో తక్కువ వ్యవఽధే ఉండటంతో పోటీ చేస్తున్న అభ్యర్థి అలా అందరిని పలుకరించే అవకాశం లేదు. దీంతో ఆ ప్రచార కార్యక్రమాల్లో అభ్యర్థుల జీవిత భాగస్వామ్యులు, కుమారులు, కుమార్తెలు, తమ్ముళ్లు, తల్లిదండ్రులు పాల్గొంటుండటంతో వారు పర్యటించే ప్రాంతాల్లోనూ టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జనసేన, బీజేపీ శ్రేణులు కూడా సంపూర్ణ మద్దతు పలికి వారితో నడుస్తున్నాయి. ఒంగోలు ఎంపీ, టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డికి అండగా కుమారుడు రాఘవరెడ్డి విస్తృతంగా పర్యటిస్తుండగా కోడలు చందనలు ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే పలువురు ఆయన సమీప బంధువులు వివిధ కీలక పనులు చక్కబెడుతున్నారు. వీరు పార్లమెంట్‌ పరిధిలో తలా ఒక ప్రాంతానికి వెళ్లి ఆయా నియోజకవర్గ అభ్యర్థితో కలిసి క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. ఇక ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ తరఫున ఆయన సతీమణి నాగసత్యలతతోపాటు కుమార్తెలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకించి మహిళా ఓటర్లు లక్ష్యంగా వారి కార్యక్రమం సాగుతుండగా జనార్దన్‌ తండ్రి కృష్ణారావు, సోదరుడు డాక్టర్‌ శివన్నారాయణలు పలు అంశాలలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కొండపి అభ్యర్థి డాక్టర్‌ డీఎ్‌సబీవీ స్వామి కుటుంబసభ్యులు ఉద్యోగులు కావడంతో ప్రత్యక్ష ప్రచారానికి దూరంగా ఉన్నా... రాజకీయంగా ఆ కుటుంబానికి సంపూర్ణ అండదండలు ఇస్తున్న పార్టీ యువనేత దామచర్ల సత్య, సీనియర్‌ నేత దామచర్ల పూర్ణచంద్రరావులు అన్నీ తామై నడిపిస్తున్నారు. సంతనూతలపాడు అభ్యర్థి బీఎన్‌ విజయకుమార్‌ తరఫున ఆయన సోదరుడు అనిల్‌కుమార్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ నియోజకవర్గాన్ని చుట్టివస్తున్నారు. దర్శి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ తరఫునఆమె భర్త డాక్టర్‌ కడియాల లలిత్‌ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. కనిగిరి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి మద్దతుగా ఆయన కుమారుడు జయసింహారెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ యువతను ఆకర్షిస్తున్నాడు. గిద్దలూరు అభ్యర్థి అశోక్‌రెడ్డి తరఫున ఆయన సతీమణి పుష్పలీల, కుమారుడు కావ్యేష్‌, సోదరి గీతలు క్యాంపెయిన్‌లో విస్తృతంగా తిరుగుతుండగా సోదరుడు కిషోర్‌రెడ్డి పలు అంశాలలో కీలకంగా పనిచేస్తున్నారు. వైపాలెం అభ్యర్థి ఎరిక్షన్‌బాబుకు మద్దతుగా కుమార్తె డాక్టర్‌ బెల్సియా, కుమారుడు అజిత్‌లు విస్తృతంగా పర్యటిస్తున్నారు. మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డికి అండగా ఆయన సోదరుడు రామిరెడ్డి నిత్యం రాజకీయ వ్యవహారాలను చక్కబెడుతుంటారు. ఇప్పుడు అన్నితానై వస్తుండగా నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మి, కుమారుడు విఘ్నే్‌షరెడ్డిలు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Updated Date - Apr 17 , 2024 | 11:33 PM