Share News

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:15 PM

మార్కాపురం పట్టణం, మండలంలో సోమవారం బక్రీద్‌ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

మార్కాపురం వన్‌టౌన్‌, జూన్‌ 17: మార్కాపురం పట్టణం, మండలంలో సోమవారం బక్రీద్‌ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్‌ సందర్భంగా ముస్లింలు నూతన వస్త్రాలు ధరించి మసీద్‌లు, ఈద్గాల వద్దకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు ఆయా మసీదులలో, 9 గంటలకు కంభం రోడ్డులోని ఈద్గా, నాగులవరం, తర్లుపాడు రోడ్లలోని ఈద్గాలలో ఈద్‌ నమాజ్‌ నిర్వహించారు. ఇమాంమ్‌లు ఖుద్భా చదివి ఈద్‌ నమాజ్‌ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక దువ్వాలు చేశారు. ముస్లింలు పేదలకు దానధర్మాలు చేశారు. టీడీపీ నియోజకవర్గ పోల్‌ మేనేజ్మెంట్‌ ఇన్‌చార్జ్‌ కందుల రామిరెడ్డి ఈద్గాల వద్దకు చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని వేములకోట, గజ్జలకొండ, రాయవరం తదితర గ్రామాలలో కూడా బక్రీద్‌ను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.

త్రిపురాంతకం : మండలంలోని పలు గ్రామాల్లో బక్రీద్‌ పండుగను ముస్లింలు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్బంగా ఉద యం నుండి మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం ఈద్గా వద్దకు తరలివెళ్లి మహమ్మద్‌ ప్రవక్త సందేశాలను చదివి వినిపించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పేదలకు దానధర్మాలు నిర్వహించారు. త్రిపురాంతకంతోపాటు మేడపి, దూపాడు, వెల్లంపల్లి గ్రామాల్లో ముస్లింలు బక్రీద్‌ను జరుపుకున్నారు.

పెద్ద దోర్నాల : మండలంలోని ముస్లింలు బక్రీద్‌ పర్వదిన వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిం చుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ముస్లింలు అందరూ ఐక్యంగా ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పేదలకు దానధర్మాలు చేశారు.

ఎర్రగొండపాలెం : బక్రీద్‌ పర్వది నాన్ని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. బక్రీద్‌ సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటలకు జామా మసీదు వద్ద ఉన్న ఈద్గా మైదానంలో పట్టణంలోని ముస్లింలు అందరు అక్కడకు చేరుకొని ప్రత్యేక నమాజ్‌, దువా చేశారు. మండలంలోని గ్రామాల్లో ఉన్న ముస్లింలు, నూరుబాయిలు ఈద్గా వద్దకు వచ్చి నమాజ్‌ చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి పండుగను నిర్వహించుకున్నారు. ఈద్గా మైదానం వద్ద ముస్లింలు ఒకరికి ఒకరు ఆప్యాతలతో ఈద్‌ ముబారక్‌ తెలుపుకున్నారు. నమాజ్‌ అనంతరం జామా మసీదు మౌలానా హిదయతుల్లా ప్రత్యేక నమాజ్‌ చేసి, దేశంలో సంవృద్ధిగా వర్షాలు కురిసి గ్రామాలు పాడిపంటలతో గ్రామాలు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. పట్టణంలోని అన్ని మసీదుల మౌలానాలు, ముస్లింలు పాల్గొన్నారు.

తర్లుపాడు : త్యాగానికి ప్రతీకగా బక్రీద్‌ వేడుకలను ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. తర్లుపాడు, తుమ్మలచెరువు గ్రామాల్లో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్లుపాడులో అబ్దుల్‌ రెహమాన్‌ ప్రత్యేక నమాజ్‌ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

గిద్దలూరు : మండలంలో బక్రీద్‌ పర్వదిన వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించు కున్నారు. స్థానిక మసీదులలో నమాజ్‌ చేసుకున్న అనంతరం ఈద్గాల వద్దకు వెళ్లి అక్కడ సామూహిక ప్రార్థనలలో పాల్గొన్నారు. బక్రీద్‌ పర్వదినం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని, మతగురువు షేక్‌ మహమ్మద్‌ ఉస్మాన్‌హఫీజ్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ అల్లాపై విశ్వాసం తో సన్మార్గంలో జీవనం గడపాలని సూచించారు. పట్టణం లోని నంద్యాల రోడ్డులో, కొంగలవీడు రోడ్లలో ఉన్న ఈద్గాల వద్ద ముస్లింలు సామూహిక ప్రార్ధనలలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ముస్లింలు బకీద్ర్‌ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొని ప్రార్ధనలు చేశారు. ఒకరికొకరు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

కంభం : బక్రీద్‌ పర్వదినాన్ని కంభం, అర్థవీడు మండలాల ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీకగా భావించే బకీద్ర్‌ పండుగ రోజు ఈద్‌ ముభారక్‌ చెప్పుకుంటూ ఒకరికొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కంభం, అర్థవీడు మండలా ల్లోని ఈద్గా మైదానాల్లో ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలను ఉద్దేశించి మతగురువులు మాట్లాడుతూ ప్రవక్త ఇబ్రహీం స్పూర్తితో ప్రజలు సత్యం, న్యాయం, త్యాగం, సహనం, పరోపకారం అలవరచుకోవాలన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 11:15 PM