సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:35 AM
అత్యవసర సమయంలో అందించే సీపీఆర్ విధానం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చని, ప్రతి ఒ క్కరూ ఈ విధానంపై అవగాహన పెంచుకోవాలని ఎస్పీ ఏఆర్.దామోదర్ తెలిపారు.
ఎస్పీ దామోదర్
ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో
పోలీసులకు అవగాహన
ఒంగోలు (కార్పొరేషన్), జూలై 30: అత్యవసర సమయంలో అందించే సీపీఆర్ విధానం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చని, ప్రతి ఒ క్కరూ ఈ విధానంపై అవగాహన పెంచుకోవాలని ఎస్పీ ఏఆర్.దామోదర్ తెలిపారు. మంగళవారం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలోని పోలీస్‌పెరేడ్ గ్రౌండ్‌లో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పోలీసు ఇబ్బందికి బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణ, సీ పీఆర్ విధానంపై అవగాహన కల్పించారు. ఈ సం దర్భంగా విచ్చేసిన ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ కార్డియాక్‌అరెస్ట్‌తో ఈ రోజుల్లో ఎక్కువగా మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితులో ఎక్కువగా పోలీస్ వారు తమ విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన వ్యక్తిని నిస్సహా యంగా చూస్తూ ఉండకుండా తమవంతుగా స హాయం చేయడానికి సీపీఆర్ విధానం (కార్డియో పల్మనరీ రెసుస్కిటషన్) అనే ప్రక్రియ ద్వారా బా ధితుడిని కాపాడే అవకాశం ఉంటుందన్నారు. విప త్కర సమయంలో సహాయం చేసేందుకు జనం భయపడుతుంటారని, కానీ పోలీసుగా విధుల్లో ఉన్నవారికి ఈ సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. పోలీసులు తమ విధుల్లో అత్యంత ఒత్తి డికి లోనవుతుంటారని, తమ తోటి సిబ్బంది ఇ లాంటి ప్రమాదానికి గురైనపుడు సీపీఆర్ చేయ డం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. డాక్టర్ ఎం.వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ ఆరో గ్య సంస్థ గణాంకాల ప్రకారంగా భారతదేశంలో సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల మంది సం వత్సరానికి గుండె సంబంధిత వ్యాధులతో మ రణిస్తున్నారని, వారిలో 27 శాతం మంది సడన్‌గా వచ్చే కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోతున్నారని చె ప్పారు. అయితే సీపీఆర్ చేయడం ద్వారా గుం డెపోటుకు గురైన వ్యక్తిని ప్రాఽథమికంగా ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. డాక్టర్ భానుమతి మా ట్లాడుతూ పోలీసు వారికి ఇటువంటి శిక్షణ అం దించడానికి తాము సిద్ధంగా ఉండటంతోపాటు ప్ర ణాళిక రూపొందిస్తున్నామన్నారు. హాస్పిటల్ సీ వోవో డాక్టర్ హరికుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఆస్టర్ రమేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి భవిష్య త్‌లో మరెన్నో ఆరోగ్యపరమైన అంశాలపై అవగా హన కల్పించడాని సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం వన్‌టౌన్, టూటౌన్, తాలూకా, ట్రాఫిక్, సీసీఎస్, ఏఆర్, పోలీసు సిబ్బందికి అవగాన క ల్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కె.నాగేశ్వరరావు,ఆస్టర్ రమేష్ సిబ్బంది కోటేశ్వరరావు, ప్రవీణ్, రాజేష్, రవితేజ, అనిల్, శివకుమారి తదితరులు పాల్గొన్నారు.