Share News

పాత కక్షలతోనే హత్యాయత్నం

ABN , Publish Date - May 30 , 2024 | 12:02 AM

టీడీపీ నాయకురాలి కుటుంబసభ్యులపై జరిగిన పెట్రోల్‌సీసా దాడి వెనుక పాత కక్షలే కారణమని డీఎ్‌సపీ రామరాజు తెలిపారు. నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలం జంగంనర్సాయపల్లె గ్రామంలో టీచర్‌ కుటుంబ సభ్యులపై పెట్రోల్‌ సీసాలతో దాడికి విఫలయత్నం జరిగిన విషయం పాఠకులకు విదితమే. దాడికి దారి తీసిన వివరాలను డీఎస్పీ బుధవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జంగంనర్సాయపల్లె ఎస్సీ కాలనీకి చెందిన తీట్ల నారాయణ 25ఏళ్ల క్రితం మండలంలోని పందువ గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది.

పాత కక్షలతోనే హత్యాయత్నం
కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎ్‌సపీ రామరాజు

జంగం నర్సాయపల్లెలో టీడీపీ నాయకురాలిపై పెట్రోల్‌ సీసాలతో దాడి ఘటన

ఒకరు అరెస్టు.. మరొకరు పరారీ

కనిగిరి, మే 29: టీడీపీ నాయకురాలి కుటుంబసభ్యులపై జరిగిన పెట్రోల్‌సీసా దాడి వెనుక పాత కక్షలే కారణమని డీఎ్‌సపీ రామరాజు తెలిపారు. నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలం జంగంనర్సాయపల్లె గ్రామంలో టీచర్‌ కుటుంబ సభ్యులపై పెట్రోల్‌ సీసాలతో దాడికి విఫలయత్నం జరిగిన విషయం పాఠకులకు విదితమే. దాడికి దారి తీసిన వివరాలను డీఎస్పీ బుధవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జంగంనర్సాయపల్లె ఎస్సీ కాలనీకి చెందిన తీట్ల నారాయణ 25ఏళ్ల క్రితం మండలంలోని పందువ గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం గుమ్మలకర్ర గ్రామంలోని ప్రాఽథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య తీట్ల చెన్నాలక్ష్మీ ఇటీవల జరిగిన సార్వత్రి ఎన్నికల్లో కూటమి టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డికి మద్దతుగా కృషి చేశారు. ఆమె భర్త, ఉపాధ్యాయుడైన తీట్ల నారాయణపై కరోనా సమయంలో అదే గ్రామంలో నివసిస్తున్న కటుకూరి బాల, కటుకూరి రహీమ్‌లకు ఏర్పడిన వివాదాన్ని మనసులో పెట్టుకుని వారి కుటుంబంపై

కక్ష తీర్చుకునేందుకు పథకం వేశారు. దీంతో ఈనెల 28న తెల్లవారుజామున (మంగళవారం) టీడీపీ నాయకురాలు, ఆమె భర్త, కుటుంబసభ్యులు ఆరుబయట నిద్రిస్తుండగా నిందితులిద్దరూ పెట్రోల్‌ను మూడు బీరు బాటిల్‌ సీసాలో నింపుకుని ఓ బాటిల్‌ను వారిపైకి విసిరేశారు. ఆ బాటిల్‌ గేటు పైభాగానికి తగిలి కింద పడింది. దీంతో మిగతా రెండు బాటిళ్లను అక్కడే పడవేసి పారిపోయారు. ఈమేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా కటుకూరి బాల (వలంటీరు, ఎలక్ర్టీషియన్‌) నాగులవరంలో ఉండగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు డీఎ్‌సపీ తెలిపారు. మరో నిందితుడు కటుకూరి రహీమ్‌ తెలంగాణకు పరారైనట్లు విచారణలో తేలిందని, అతనిని కూడా పట్టుకుంటామన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుడిని కోర్టుకు హాజరు పరుచనున్నట్లు డీఎ్‌సపీ తెలిపారు. అనతి కాలంలోనే కేసును ఛేదించిన సీఐలు వెంకటేశ్వరరావు, రామానాయక్‌, ఎస్‌ఐలను, సిబ్బందిని అభినందించారు.

Updated Date - May 30 , 2024 | 12:02 AM