Share News

కౌంటింగ్‌ ప్రక్రియకు సహకరించాలి

ABN , Publish Date - May 29 , 2024 | 11:59 PM

ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తిఅయ్యేలా రాజకీయపార్టీ నేతలు సహరించాలని జిల్లా ఎస్పీ గరుడ్‌సుమిత్‌ సునీల్‌ అన్నారు. స్థానిక ప్రయివేటు ఫంక్షన్‌ హాలులో బుధవారం కౌంటింగ్‌ ప్రక్రియలో అమలు చేసే ఈసీ నిబంధనలపై వివిధ రాజకీయపార్టీ నేతలతో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కనిగిరి ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా రాజకీయపార్టీల నేతలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. వెలిగండ్ల, మరో రెండు చోట్ల చిన్నచిన్న సంఘటనలు పొరపాట్లే తప్ప నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా ప్రవర్తించలేదన్నారు. అందుకు కనిగిరి ప్రాంత నేతలకు ఎస్‌పీ అభినందనలు తెలిపారు.

కౌంటింగ్‌ ప్రక్రియకు సహకరించాలి
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎస్‌పీ సుమిత్‌ సునీల్‌

కనిగిరి, మే 29: ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తిఅయ్యేలా రాజకీయపార్టీ నేతలు సహరించాలని జిల్లా ఎస్పీ గరుడ్‌సుమిత్‌ సునీల్‌ అన్నారు. స్థానిక ప్రయివేటు ఫంక్షన్‌ హాలులో బుధవారం కౌంటింగ్‌ ప్రక్రియలో అమలు చేసే ఈసీ నిబంధనలపై వివిధ రాజకీయపార్టీ నేతలతో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కనిగిరి ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా రాజకీయపార్టీల నేతలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. వెలిగండ్ల, మరో రెండు చోట్ల చిన్నచిన్న సంఘటనలు పొరపాట్లే తప్ప నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా ప్రవర్తించలేదన్నారు. అందుకు కనిగిరి ప్రాంత నేతలకు ఎస్‌పీ అభినందనలు తెలిపారు. అదేవిధంగా కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసి ఈసీ నిబంధనలు ఎత్తివేసేంతవరకూ కూడా ఇదే సూర్తితో ముందుకు వెళ్ళాలని కోరారు. అదేవిధంగా కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత మెజార్టీలపై, గెలుపులపై ఎక్కడా చర్చలు చేయకూడదన్నారు. నలుగురికి మించి గుంపుగా ఉన్నా కూడా ఈసీ నిబంధనలకు విరుద్ధమే అన్నారు. ఎన్నికలకు ముందు చేసిన బైండోవర్‌లను ఉల్లంఘించి నడుచుకునే రాజకీయపార్టీ నేతల సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. బైండోవర్‌లో నియమాలు ఉల్లంఘించి నిబందనలను అతిక్రమించి అల్లర్లకు, దాడులకు పాల్పడితే క్రిమినల్‌ కేసుతోపాటు రూ. 2లక్షల వరకు జరిమానా, జైలుశిక్ష విధిస్తామన్నారు. ప్రజలు శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో జీవించేలా రాజకీయపార్టీల నాయకులు సహకరించాలన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చిన వాటిని స్వాగతించి రాజకీయపార్టీల నేతలు వాటిని సమానంగా తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ అనంతరం కూడా ఎలాంటి ఘర్షణలకు, గొడవలకు, కొట్లాటలకు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సదస్సులో డీఎస్సీ రామరాజు, సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:59 PM