Share News

వైసీపీ ఓటమే ఆర్యవైశ్యుల లక్ష్యం

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:16 AM

వచ్చే ఎన్నిక ల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా ఆర్యవైశ్యులు పనిచే స్తారని, ఒక్కరోజు వ్యాపారం పక్కనపెట్టి వస్తే వై శ్యుల సత్తా ఏమిటో తెలుస్తుందని ఆర్యవైశ్య సం ఘం నాయకులు ధ్వజమెత్తారు.

 వైసీపీ ఓటమే ఆర్యవైశ్యుల లక్ష్యం

ఎమ్మెల్యే బాలినేని బెదిరింపులకు భయపడేది లేదు..

ఆర్యవైశ్య సంఘ నాయకులు

టీడీపీని గెలిపించుకుంటామని స్పష్టీకరణ

ఒంగోలు(కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 2: వచ్చే ఎన్నిక ల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా ఆర్యవైశ్యులు పనిచే స్తారని, ఒక్కరోజు వ్యాపారం పక్కనపెట్టి వస్తే వై శ్యుల సత్తా ఏమిటో తెలుస్తుందని ఆర్యవైశ్య సం ఘం నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం ఒంగోలు నగరం ఏనుగు చెట్టువద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయ కుడు నల్లమల్లి బాలు పలువురు టీడీపీ వైశ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కొం తమంది వైసీపీ ఆర్యవైశ్యులు కొణిజేటి రోశయ్య ఫ్యాన్స్‌ పేరుతో వైశ్యులను కించపరిచేవిధంగా క రపత్రాలు ముద్రించడం దుర్మార్గమన్నారు. గతం లో వైసీపీలో తాను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరె డ్డికి, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డికి విధేయుడు గా ఉన్నానని తెలిపారు. అయితే తండ్రీ, కొడుకు ఇ ద్దరూ తనను మోసం చేశారని చెప్పారు. అంతేగా కుండా బెదిరింపులకు పాల్పడితే ఇక్కడెవరూ భ యపడరని ఆయన స్పష్టం చేశారు. పల్లపోతు వెం కటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మ న్‌ కుప్పం ప్రసాద్‌ నోరు అదుపులో పెట్టుకుని మా ట్లాడాలన్నారు. కార్పొరేషన్‌ చైర్మన్‌గా వైశ్యులకు చే సింది ఏమీ లేదని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, ఓట్లు వేసి గెలిపించినందుకు తమ ను ఘోరంగా మోసం చేశారని మండిపడ్డారు. రా బోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం వైశ్యులు పనిచేస్తారన్నారు. వైసీపీ ఓటమి లక్ష్యంగా పనిచే సి, దామచర్లను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్యవైశ్య నాయకు లు మిరియాల కృష్ణ, తాతా చెంచయ్యగుప్తా, క నమర్లపూడి హరిప్రసాద్‌, పబ్బిశెట్టి భాస్కర్‌, వలి వేటి పవన్‌ కుమార్‌, కొల్లిపల్లి సురేష్‌, కొంకిమళ్ళ శ్రీనివాసరావు, ఉమా, యశ్వంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:16 AM