Share News

కళలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక

ABN , Publish Date - May 27 , 2024 | 10:54 PM

కళలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, దానిని కళాకారులు నాటికల ప్రదర్శన ద్వారా నేటి తరాలవారికి అందిస్తున్నారని, కళా పరిషత్‌లను అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్‌ ఎన్టీఆర్‌ ట్రస్టీ డాక్టర్‌ పీ కృష్ణయ్య అన్నారు.

కళలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక

వాటిని భావి వితరాలకు అందిస్తున్న కళాకారులు

కళా పరిషత్‌లను ప్రోత్సహించాలి

మార్టూరు, మే 27 : కళలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, దానిని కళాకారులు నాటికల ప్రదర్శన ద్వారా నేటి తరాలవారికి అందిస్తున్నారని, కళా పరిషత్‌లను అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్‌ ఎన్టీఆర్‌ ట్రస్టీ డాక్టర్‌ పీ కృష్ణయ్య అన్నారు. సోమవారం రాత్రి మార్టూరులో శ్రీకారం రోటరీ కళా పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రారంభించిన 14వ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలకు కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై ఎఫర్ట్‌ డైరెక్టర్‌ జాష్టి వెంకట మోహనరావు అధ్యక్షత వహించగా వేదిక పైకి ఆహుతులను శ్రీకారం సంస్థ అధ్యక్షుడు కంది మళ్ల సాంబ శివరావు ఆహ్వానించారు. ముఖ్య అతిదిగా విచ్చేసిన కృష్ణయ్య మాట్లాడుతూ మార్టూరు లో రోటరీ కళా పరిషత్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. అంతకు ముందు అధ్యక్షత వహించిన జాష్టి వెంకట మోహనరావు మాట్లాడుతూ మార్టూరు రోటరీ క్లబ్‌ చేసిన సేవా కార్యక్రమాల గు రించి వి వరించారు. అదేవిధంగా ఏడాదికి ఎంతో ఖర్చు అ వుతున్నప్పటికి కళా పరిషత్‌ నాటిక పోటీలను నిర్వహిస్తూ కళా కారులకు ప్రోత్సాహంగా ఉంటున్నామన్నారు. ప్రజా సమస్యలను కళల రూపంలో సమాజంలో కళా కారులు ప్రదర్శించడం ద్వారా ప్రజలతో పాటు, ప్రభుత్వాలు కూడా ఆలో చిస్తాయన్నారు. సభా కార్యక్రమానికి ముందు ఈ పోటీలను రోటరీ గవర్నర్‌ డాక్టరు బూసి రెడ్డి శంకరరెడ్డి నటరాజ విగ్రహం వద్ద పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం రొటేరియన్లు జీవీ సేతురామన్‌, వసంత సేతు రామన్‌ లకు రోటరీ కళా పరిషత్‌ వారు ముఖ్య అతిది కృష్ణ య్య చేతుల మీదగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిదులుగా జన విజ్ణా న వేదిక అధ్యక్షులు వి లక్ష్మణ రెడ్డి, రోటరీ పూర్వ గవర్నర్‌ ఎ ఆర్‌ ప్రభాకర్‌ తదితరులు విచ్చేశారు. ఈ నాటిక పోటీలను రోటరీ అధ్యక్షులు తాళ్లూరి సాంబ శి వరావు, శ్రీకారం కార్యదర్శి జాష్టి అనూరాధ, కొర్రపాటి కాజారావు, శానంపూడి లక్ష్మయ్య షేక్‌ కాజా హుస్సేన్‌ తదితరులు పర్య వేక్షించారు.

Updated Date - May 27 , 2024 | 10:54 PM