Share News

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - May 30 , 2024 | 11:06 PM

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు దర్శి అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి ఎంవీవీఎస్‌ లోకేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆర్వో కార్యాలయంలో గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంగోలులోని రైజ్‌ కళాశాలలో దర్శి అసెంబ్లీ కౌంటింగ్‌ జూన్‌ 4న జరుగుతుందని చెప్పా రు.

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
సమావేశంలో మాట్లాడుతున్న రిటర్నింగ్‌ అధికారి లోకేశ్వరరావు

దర్శి, మే 30: కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు దర్శి అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి ఎంవీవీఎస్‌ లోకేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆర్వో కార్యాలయంలో గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంగోలులోని రైజ్‌ కళాశాలలో దర్శి అసెంబ్లీ కౌంటింగ్‌ జూన్‌ 4న జరుగుతుందని చెప్పా రు. అభ్యర్థులు, ఏజెంట్లు నిబంధనలను తుచ తప్పకుండా పాటించాలని కోరారు. సెల్‌ఫోన్లు తీసుకెళ్లేందుకు వీలులేదన్నారు. ఎవరైనా గొడవలు చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనవసర తగాదాలతో కౌంటింగ్‌ ప్రక్రియకు విఘాతం కల్గిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 11:06 PM