Share News

ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూముల ఆక్రమణ

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:20 PM

అధికారులు ఎన్నికల హడావుడిలో ఉండఛింతో వైసీపీ నేతల కనుసన్ననలో అద్దంకిలో ఆక్రమణల పర్వం కొనసాగింది. పట్టణంలో పలు చోట్ల ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. ఎన్నికల హడావుడి మొత్తం ముగిసినందున అధికారులు కళ్లు తెరిచి ఆక్రమణల తొలగింపు కు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తే తాత్కాళిక కట్టడాల స్థానంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టడంతో పాటు మిగిలిన ప్రాంతం కూడా ఆక్రమణదారులపరం అయ్యే అవకాశం ఉం ది. అద్దంకిలో స్థలాల ధరలు విపరీతంగా పెరిగాయి.

ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూముల ఆక్రమణ
శింగరకొండపాలెం సమీపంలో అద్దంకి కొండపై వైసీపీ నాయకుల కనుసన్నల్లో ఆక్రమించి కట్టిన నిర్మాణాలు..

ఎన్నికలవేళ వైసీపీ నేతల కనుసన్ననలో కబ్జాలు

మరికొన్ని చోట్ల ఆక్రమించి అమ్మకాలు

ఇకనైనా అధికారులు కళ్లు తెరిచేనా

అద్దంకి, జూన్‌ 11 : అధికారులు ఎన్నికల హడావుడిలో ఉండఛింతో వైసీపీ నేతల కనుసన్ననలో అద్దంకిలో ఆక్రమణల పర్వం కొనసాగింది. పట్టణంలో పలు చోట్ల ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. ఎన్నికల హడావుడి మొత్తం ముగిసినందున అధికారులు కళ్లు తెరిచి ఆక్రమణల తొలగింపు కు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తే తాత్కాళిక కట్టడాల స్థానంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టడంతో పాటు మిగిలిన ప్రాంతం కూడా ఆక్రమణదారులపరం అయ్యే అవకాశం ఉం ది. అద్దంకిలో స్థలాల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా ఓటింగ్‌ చేయించేందుకు శింగరకొండపాలెం కు చెందిన వైసీపీ నేత పేదలకు ఇళ్ల స్థలాల పేరిట అద్దంకి కొండ వద్ద సుమా రు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని హడావుడిగా చదును చేయించారు. అప్పటికప్పుడే ప్లాట్లు వేసి ఇళ్లు వేసుకోమని చెప్పారు. దీంతో పలువురు పరుగులు తీసి తాత్కాళిక నిర్మాణాలు కూడా చేశారు. రెవెన్యూ సిబ్బంది పలు సార్లు వారించినా ఆక్రమణలు మాత్రం ఆగలేదు. అదే సమయంలో శింగరకొండ రోడ్డులో ఆటోనగర్‌కు సమీపంలో రెండు వైపులా ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఇదే అదనుగా సమీప స్థలాల యజమానులు, వైసీపీ మహిళా నేత కుమ్మక్కై ఆక్రమించి తాత్కాళిక నిర్మాణాలు చేపట్టారు. ఆటోనగర్‌ సమీపంలోనే మున్సిపాలిటీ అవసరాల కోసం కేటాయించిన భూమిలో కూడా ఆ క్ర మణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే ఊర చెరువులో స్థానిక వైసీపీ నేత కనుసన్ననలో సుమారు రెండు ఎకరాల భూమి ఆ క్రమించి అమ్మకాలు జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ముందస్తుగానే ఊర చెరువు అభివృద్ధికి నిధులు మంజూరై పనులు చేసే సమయంలోనే ఆక్రమిత స్థలం వదిలి మట్టి కట్ట ఏర్పాటు చేయించడం కూడా జరిగింది. అవకాశం కోసం వేసి ఉన్న సదరు నేత ఎన్నికల సమయంలో ప్లాట్ల అమ్మకాలు చేపట్టారు. సదరు ప్లాట్లలో కొందరు తాత్కాళిక నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇలా మరి కొన్ని చోట్ల కూడా ప్రభుత్వ భూములు యధేశ్చగా ఆక్రమణలు జరిగాయి. రెవెన్యూ సిబ్బంది వారించినప్పటికీ ఆ తదుపరి యథావిధిగా ఆక్రమణదారులు తమ పని తమదే అన్నట్లు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఎన్నికల విధులు ముగిసినందున ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూములలో ఆక్రమణల తొలగింపు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అధికారులు మాత్రం ఎన్నికల విధుల కోసమే తాము వచ్చినట్లు ఆక్రమణల గురించి ఫిర్యాదులు అందినా స్పందించడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ క్రమణలు తొలగించి ప్రభుత్వ భూమి ని సంరక్షించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ క్రమణల తొలగింపు చేస్తారా లేక కొద్దిరోజులు ఎదో విధంగా కళ్లు మూసుకొని బదిలీలలో వెళ్లి పోతారో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - Jun 11 , 2024 | 11:20 PM