Share News

‘కొంప’ముంచిన ఆప్కాస్‌..!

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:52 PM

త్వరలోనే తమకు ఇంటి స్థలం వస్తుందని అవుట్‌ సోర్సింగ్‌కార్పొరేషన్‌ (ఆప్కా్‌స)లో పనిచేసే వారంతా ఆశపడ్డారు. రెండేళ్ల క్రితం అందించిన భరోసా పత్రాలతో మురిసిపోయారు. సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చని సంబరపడ్డారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు అందే సమయంలో ఆరు అంచెల ఆంక్షలు అడ్డంకిగా మారాయి. చాలీచాలని వేతనాలతో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు నిబంధనల కారణంగా ప్రభుత్వం అందించే జగనన్న ఇళ్ల పథకానికి దూరమయ్యారు.

‘కొంప’ముంచిన ఆప్కాస్‌..!

ఇళ్లస్థలాలకు అర్హత కోల్పోయిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు

మొన్న భరోసా పత్రాలు ఇచ్చారు..

నేడు వీలుకాదన్నారు

పేదలుగా గుర్తించి తమకు పట్టాలు ఇవ్వాలంటున్న లబ్ధిదారులు

ఒంగోలు (కార్పొరేషన్‌), ఫిబ్రవరి 25 : త్వరలోనే తమకు ఇంటి స్థలం వస్తుందని అవుట్‌ సోర్సింగ్‌కార్పొరేషన్‌ (ఆప్కా్‌స)లో పనిచేసే వారంతా ఆశపడ్డారు. రెండేళ్ల క్రితం అందించిన భరోసా పత్రాలతో మురిసిపోయారు. సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చని సంబరపడ్డారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు అందే సమయంలో ఆరు అంచెల ఆంక్షలు అడ్డంకిగా మారాయి. చాలీచాలని వేతనాలతో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు నిబంధనల కారణంగా ప్రభుత్వం అందించే జగనన్న ఇళ్ల పథకానికి దూరమయ్యారు.

అర్హత కోల్పోయిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు

ఆప్కా్‌సలో పనిచేసే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతుండడంతో ఇప్పటికే వేలాది మంది అమ్మఒడి, రేషన్‌కార్డు, జగనన్న చేయూత, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇతర సంక్షేమ పథకాలనుకోల్పోయారు. ఇప్పుడు నివేశన స్థలాలకూ దూరమయ్యారు. ఇప్పటికే భరోసా పత్రాలు పొందిన వారి జాబితాలను ప్రత్యేకంగా రూపొందించిన డీఐసీ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆన్‌లైన్‌ పొందుపరిచారు. దీంతో ప్రభుత్వ కార్యాయాల్లో ఆప్కాస్‌ కింద పనిచేస్తూసీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా జీతాలు తీసుకుంటున్న సుమారు 2500 మంది వరకు అర్హత కోల్పోయారు. వీరిలో ఇతర శాఖల్లో పనిచేస్తున్న కొందరికి పట్టాలు వచ్చాయి. మరికొందరికి అర్హత లేదని నిరాకరించారు. నగర పాలక సంస్థలో ఆప్కాస్‌ కింద పనిచేస్తున్న వారిలో ఒక్కరికి కూడా ఇంటి పట్టా అందలేదు.

న్యాయం చేయాలి : లబ్ధిదారులు

ఆప్కాస్‌ ద్వారా ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో సుమారు 1,200 మంది వరకు పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్‌, రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌, ఇతర సెక్షన్లలో పనిచేస్తున్నారు. వారితోపాటుఒంగోలులోని34 ప్రభుత్వ కార్యాలయాల్లో మరో 3వేలమంది వరకు పనిచేస్తున్నారు. ఒకవైపు చాలీచాలని వేతనాలు, మరోవైపు భద్రత లేని ఉద్యోగాలు, ఇంకోవైపు పెరిగిన ధరలతో వారు ఇబ్బందులు పడుతున్నారు. అప్కా్‌సలో ఉన్నందుకు తమకు అన్ని విధాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. ఆరు అంచెల విధానం నుంచి ఆప్కాస్‌ కింద పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చి ఇళ్ల పట్టాలు అందించాలని కోరుతున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 11:52 PM