Share News

Prakasam: కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు.. ఏ జిల్లా వారంటే

ABN , Publish Date - May 22 , 2024 | 09:54 PM

కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై స్థానికులు దాడులు చేస్తున్న వేళ.. తెలుగు విద్యార్థులు కొందరు అక్కడే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాకి(Prakasham Dist) చెందిన10 మంది విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేందుకు కిర్గిస్థాన్ వెళ్లారు.

Prakasam: కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు.. ఏ జిల్లా వారంటే

ప్రకాశం: కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై స్థానికులు దాడులు చేస్తున్న వేళ.. తెలుగు విద్యార్థులు కొందరు అక్కడే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాకి(Prakasam Dist) చెందిన10 మంది విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేందుకు కిర్గిస్థాన్ వెళ్లారు. వారం రోజులుగా అక్కడ పరిస్థితులు భయానకంగా ఉండటంతో.. ఏపీ విద్యార్థులు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.


వారం రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తమను స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను త్వరగా స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.

Updated Date - May 22 , 2024 | 09:54 PM