Share News

మరో రూపాయి పెరుగుదల

ABN , Publish Date - May 23 , 2024 | 01:14 AM

దక్షిణాది పొగాకు మార్కెట్‌లో బుధవారం కూడా జోరు కొనసాగింది. మేలురకం, మీడియం, లోగ్రేడ్‌ ఇలా అన్నింటినీ బయ్యర్లు పోటీపడి కొనుగోలు చేశారు.

మరో రూపాయి పెరుగుదల

ఒంగోలు-1లో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.323

ఒంగోలు, మే 22 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్‌లో బుధవారం కూడా జోరు కొనసాగింది. మేలురకం, మీడియం, లోగ్రేడ్‌ ఇలా అన్నింటినీ బయ్యర్లు పోటీపడి కొనుగోలు చేశారు. మేలురకం గరిష్ఠ ధర మరో రూపాయి పెరిగింది. మంగళవారం కిలోకు రూ.322 లభించగా బుధవారం 323కు చేరింది. ఒంగోలు-1 వేలంకేంద్రంలో ఆ ధర లభించింది. ఇతర కేంద్రాల్లోనూ గరిష్ఠ ధరలు రూ.320కి అటు ఇటుగా పలికాయి. ఇక మీడియం రకం బేళ్లు కిలో రూ.300పైనే ఉండగా.. లోగ్రేడ్‌లో నాణ్యమైన బ్రౌన్‌, ఇతర రకాల ధర కూడా కిలో రూ.270 పైనే దక్కింది. వారం క్రితం వరకు నోబిడ్‌లు కొంతమేర ఉంటుండగా ప్రస్తుతం వాటి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఇప్పటివరకూ సుమారు 53 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోళ్లు జరగ్గా సగటున కిలోకు రూ.243పైగానే ధర లభించింది.

Updated Date - May 23 , 2024 | 01:14 AM