Share News

దున్నపోతుకు అర్జీలు ఇచ్చి అంగన్‌వాడీల నిరసన

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:10 AM

అంగన్‌వాడీల సమ్మె లో భాగంగా, దున్నపోతుకు అర్జీ ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. నేడు జిల్లా కలెక్టరేట్‌ వద్ద సామూహిక ధర్నా చేయనున్నామని పేర్కొ న్నారు.

దున్నపోతుకు అర్జీలు ఇచ్చి అంగన్‌వాడీల నిరసన

గిద్దలూరు, జనవరి 2 : అంగన్‌వాడీల సమ్మె లో భాగంగా, దున్నపోతుకు అర్జీ ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. నేడు జిల్లా కలెక్టరేట్‌ వద్ద సామూహిక ధర్నా చేయనున్నామని పేర్కొ న్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడి వర్కర్స్‌ యూని యన్‌ ప్రతినిధులు స్వర్ణకుమారి, మున్నా, విజయలక్ష్మి, కొండమ్మ, సీఐటీయూ నాయ కులు కొండమ్మ, ఆవులయ్య పాల్గొని ప్రసంగించారు.

పెద్ద దోర్నాల : అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రఫీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్‌టీసీ బస్టాండు వద్ద తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నిర్వహిస్తున్న నిర్వధిక సమ్మె మంగళవారం కొనసాగింది. సమ్మెకు మద్దతు తెలిపిన రఫీ మాట్లాడుతూ.. గత ఇరవై రోజులకు పైగా అంగన్‌వాడీ మహిళలందరూ వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఉద్యోగభద్రత కల్పించాలని, 26వేలు వేతనంగా ఇవ్వాలని, 62ఏళ్లకు రిటైర్మెం ట్‌ పొడిగించాలని తదితర న్యాయమైన కోరికలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. కార్యక్ర మంలో సీపీఐ నాయకులు విశ్వరూపాచారి, బాణాల రామయ్య, పీ.తిరుమలయ్య, వెంకట లక్ష్మీ, సుబ్బమ్మ, వెంకటరత్నం, షేక్‌ ముంతాజ్‌ బేగం, భారతి,పద్మ తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : గత 22 రోజులుగా సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నాసరయ్య, రూబెన్‌, రేణుక, వెంకట రత్నం పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా పొదిలి లోనూ దున్నపోతకు వినతిపత్రం అందజేశారు.

ఎర్రగొండపాలెం : వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసరాలు మొదలుకొని విద్యుత్తు చార్జీలు అన్ని పెంచారని, ఇలాంటి తరుణంలో తమ జీతాలు పెరగకపోతే తాము ఎలా జీవించాలని పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రశ్నించారు. అగన్‌వాడీల సమ్మె 22వ రోజూ ఎర్రగొండపాలెం లో కొనసాగింది. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే రానున్న ఎన్నికల్లో అంగన్వాడీల సతా ్తఏమిటో చూపిస్తామని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌్క్ష హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు జి మల్లేశ్వరి, పి సుబాషిణి, నాగరాజకుమారి, రామసుబ్బమ్మ, అరుణ, సునీత, తలపాటి సుబ్బమ్మ, సుజాత, విజయలక్ష్మి, రూత్‌మేరి, రామకుమారి, తిరుపాలమ్మ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 01:10 AM