Share News

రాష్ట్రంలో అరాచక పాలన

ABN , Publish Date - Mar 26 , 2024 | 10:44 PM

కాకినాడ శివాలయంలో అర్చకునిపై వైసీపీ నేత దాడి ఘటన జగన్‌రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఈమేరకు మంగళవారం ఓప్రకటన విడుదలచేశారు. యథా నాయకుడు, తథా క్యాడర్‌ అన్న చందంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. వేదాలు చదివి భగవంతుని సేవలో తరించే అర్చకులపై దాడి చేయటం, బెదిరింపులకు గురిచేయటం రాక్షసత్వమే అవుతుందన్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన
గొట్టిపాటి రవికుమార్‌, అద్దంకి ఎమ్మెల్యే

- అర్చకునిపై వైసీపీ నేత దాడి అందుకు నిదర్శనం

- ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

అద్దంకి, మార్చి 26: కాకినాడ శివాలయంలో అర్చకునిపై వైసీపీ నేత దాడి ఘటన జగన్‌రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఈమేరకు మంగళవారం ఓప్రకటన విడుదలచేశారు. యథా నాయకుడు, తథా క్యాడర్‌ అన్న చందంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. వేదాలు చదివి భగవంతుని సేవలో తరించే అర్చకులపై దాడి చేయటం, బెదిరింపులకు గురిచేయటం రాక్షసత్వమే అవుతుందన్నారు. పూజారులపై దాడి చేయటం అంటే దేవుడిపై దాడి చేయటమేనని అన్నారు. భగవంతుని సన్నిధిలో అందరూ ఒక్కటే అనే ఇంగిత జ్ఞానం కూడా వైసీపీ నేతలకు లేకపోవటం భాధాకరమని చెప్పారు. హిందూ దేవాలయాలు, ఆస్తులపై పూర్తి ఆధిపత్యం చెలాయించే క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం దారుణాలకు ఒడిగడుతుందన్నారు. తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగా పోయలేదని అర్చకుడిపై వైసీపీ నేత చం ద్రరావు దాడి చేయటం, చెంపపై కొట్టి కాలితో తన్నటంతో పాటు, అడ్డుకోబోయిన మరో అర్చకుడుపైనా దాడి చేసి బూతులు తిట్డాడన్నారు. ఈ ఐదేళ్ళ జగన్‌రెడ్డి పాలనలో హిందూ దేవాలయాల అభివృద్ధి శూన్యమని చెప్పారు. అర్చకులకు వేతనాల పెంపు లేకపోగా, వారిపైనే దాడులకు దిగుతున్నారన్నారు. కరోనా సమయంలో చనిపోయిన అర్చకుల కుటుంబాలను కూడా జగన్‌రెడ్డి ఆదుకోలేదన్నారు. ఆయన పాలనలో అర్చకుల పై వరుస దాడులు జరిగాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వర స్వామి ఆలయ అర్చకుడి యజ్ఞోపవీతాన్ని వైసీపీ నేత యుగంధర్‌ తెంపేశాడన్నారు. కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అర్చకులపై ఆలయ చైర్మన్‌ ప్రతాపరెడ్డి దాడి చేశారన్నారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ఆంజనేయస్వామి గుడి అర్చకుడు సాగు చేసుకుంటున్న భూమిపై కన్నేసిన వైసీపీ నేతలు ఆ క్రమించుకునేందుకు ప్రయత్నించటంతో పూజారి భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో అర్చకుడు రామలింగాచారి ఇంటిని వైసీపీ నేతలు కూల్చేయటంతో తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. నర్సరావుపేట సమీపంలోని త్రికోటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన ఓ వైసీపీ నేత తనకు అర్చకుడు సరిగ్గా మర్యాద లు చేయలేదంటూ దాడి చేశాడన్నారు. గుంటూరు జిల్లా గోరంట్లలో వెంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు ఆరోగ్యం బాగా లేక సెలవు అడిగితే ఏకంగా అధికారులే అతనిపై దాడి చేశారన్నారు. ఇలా ఐదేళ్ళ కాలంలో లెక్కలేనన్ని సంఘటనలు జరిగాయని ఎమ్మెల్యే గొట్టిపాటి పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల క్షేమం కోరే బ్రాహ్మణులు, అర్చకులపై వైసీపీ పాలనలో దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 47 రోజులలో రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు.

నేడు పలు గ్రామాల నేతలతో ఎమ్మెల్యే సమావేశం

అద్దంకి, మార్చి 26: పలు గ్రామాల నేతలతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ముప్పవరం వద్ద క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అద్దంకి మండలంలోని చక్రాయపాలెం నేతలతో ఉదయం 10 గంటలకు, 10.20కి గోపాలపురం, 10.40 గంటలకు శింగరకొండపాలెం, కొత్తరెడ్డిపాలెం, 11 గంటలకు చినకొత్తపల్లి, శ్రీనివాసనగర్‌, 11.20కి గోవాడ, సాధునగర్‌, 11.40 గంటలకు కలవకూరు, గుర్రంవారిపాలెం, మధ్యాహ్నం 12 గంటలకు శంఖవరప్పాడు, 12.20కి ధర్మవరం, 12.40కి మైలవరం, ఏలేశ్వరవారిపాలెం, ఒంటి గంట కు ఉప్పలపాడు, 1.20కి వెంపరాల గ్రామాల నేతలు, కార్యకర్తలతో రవికుమార్‌ సమీక్ష నిర్వహించనున్నారు.

కాగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ బుధవారం ఉదయం పలు గ్రామాలలో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఉదయం 8 గంటలకు సంతమాగులూరు, 8.30కి గొర్రెపాడు, 9 గంటలకు కొమ్మినేనివారిపాలెం, 9.30కి బల్లికురవ, 10 గంటలకు కొండాయపాలెంలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Updated Date - Mar 26 , 2024 | 10:45 PM