Share News

అరాచక ప్రభుత్వాన్ని సాగనంపాలి

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:51 PM

అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. వైసీ పీ పాలనలో అన్నివర్గాలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శనివారం ఇంకొల్లులో జరిగిన రా కదిలి రా స భలో ఆయన మాట్లాడారు.

అరాచక ప్రభుత్వాన్ని సాగనంపాలి
ఇంకొల్లులో జరిగిన రా కదలిరా సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాంబశివరావు, చంద్రబాబుతో ముచ్చటిస్తున్న ఏలూరి

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపు

ఇంకొల్లు, ఫిబ్రవరి 17: అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. వైసీ పీ పాలనలో అన్నివర్గాలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శనివారం ఇంకొల్లులో జరిగిన రా కదిలి రా స భలో ఆయన మాట్లాడారు. రైతాంగానికి సరైన సమ యంలో సాగునీరు అందించకపోవడంతో ఈప్రాంత రై తులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గత ప్రభుత్వంలో తక్కువ నీరు ఉన్నా పంటలు పండించేలా చేసిన ఘన త చంద్రబాబుదని గుర్తుచేశారు. చదువుకున్న వారికి ఉ ద్యోగాలు లేవని, ఉద్యోగాలు చేసే ఉద్యోగులకు 1వ తేదీన జాతాలు లేవని అన్నారు. మద్య నిషేధమని ప్రగల్భాలు పలికి జేబ్లాండ్లతో సామాన్యుల జీవితాలతో ఆడుకుంటు న్నారని ధ్వజమెత్తారు. తెలుగుజాతి గుర్తింపునకు నిర్వ రామంగా కృషిచేసే వ్యక్తి చంద్రబాబునాయుడని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అరాచక పాలనతో తప్పుడు కేసు లు బనాయించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలన్నారు. ఎన్ని అడ్డం కులు పెట్టినా సభకు వేలాది మంది తరలివచ్చి సంఘీ భావం తెలపడం అభినందనీయమన్నారు. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో మీప్రాంతంలో ఏమి అభి వృద్ధి జరిగిందో, వైసీపీ పాలనలో ఏమి అభివృద్ధి జరిగిం దో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. యువత భవిష్య తును తీర్చిదిద్దే సత్తా ఉన్నా నాయకులు చంద్రబాబు అని ఏలూరి పేర్కొన్నారు.

సత్తా ఉన్న నాయకుడు ఏలూరి

సత్తా ఉన్న నాయకుడు ఏలూరి సాంబశివరావు అని చంద్రబాబు ప్రశంసించారు. ఇంకొల్లులో జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతూ చీరాలలో ఛీ అన్న ఓ వైసీపీ నాయకుడు పర్చూరు నియోజకవర్గంలో కబ్జాలు, అక్రమకేసులు, ఫాం 7తో 14 వేల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించిన దొంగపై పోరాడి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి ముగ్గురు పోలీసులను సస్పెండు చేయించిన ఏలూరి సత్తా కలిగిన నాయకుడని ప్రశంసించారు. పర్చూరు ప్రాంత ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇంకొల్లులో ఆటోనగర్‌ ఏర్పాటుచేసి ముస్లింలకు అండగా ఉంటామన్నారు. పర్చూరులో పేదలకు 2 సెంట్లు చొ ప్పున ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తామన్నారు. నియో జకవర్గంలో గ్రానైట్‌ యజమానులు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి కృషి చే స్తామన్నారు. పంట కాల్వలను ఆధునీకరించి సాగు నీరందిస్తామని చెప్పారు. గోదావరి నీళ్లు సాగర్‌ కుడికాల్వకు తీసుకొచ్చి పం టలకు నీళ్లు అందించే బాధ్యత నాది అని చెప్పారు. నన్ను నమ్మండి.. మీ భవిష్యత్తులో వెలుగు నింపుతానని చంద్రబాబు పేర్కొన్నారు. సభలో ఎమ్మె ల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, స్వామి, సత్యప్రసాద్‌, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు, టీడీపీ క నిగిరి, బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ లు ఉగ్ర నరసింహారెడ్డి, నరేంద్రవర్మ, ఉండవల్లి శ్రీదేవి, జనార్దన్‌, జనసేన నాయకులు రియాజ్‌, విజయకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 10:51 PM