ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన
ABN , Publish Date - Feb 14 , 2024 | 01:11 AM
నగరంలోని ఆగ్జీలియం ఇంగ్లీషు మీడియం స్కూలులో మంగళవారం నిర్వహించిన ఇన్‌స్పైర్ 2022-23 వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు 8 ప్రాజెక్టులు ఎంపిక
ఒంగోలు(విద్య), ఫిబ్రవరి 13 : నగరంలోని ఆగ్జీలియం ఇంగ్లీషు మీడియం స్కూలులో మంగళవారం నిర్వహించిన ఇన్‌స్పైర్ 2022-23 వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్రదర్శనను జిల్లా విద్యాశాఖాధికారి డి.సుభద్ర ప్రారంభించి ఎగ్జిబిట్‌లను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అభిలాషను పెంచాలన్నారు. సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. మొత్తం 79 ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించారు. వీటిలో ఎనిమిది ఉత్తమ ఎగ్జిబిట్స్‌ను చిత్తూరులో జరగనున్న రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు.