ప్రజల దాహార్తి తీర్చని ఆర్వో ప్లాంట్
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:27 AM
మండలంలోని కలుజు వ్వలపాడులో జంగంరెడ్డిపల్లి కాలనీలో మూడేళ్ల క్రితం రూ.12.20లక్షలతో ఆర్వో ప్లాంట్ నిర్మించి ప్రారంభించారు.
తర్లుపాడు, ఆగస్టు 19: మండలంలోని కలుజు వ్వలపాడులో జంగంరెడ్డిపల్లి కాలనీలో మూడేళ్ల క్రితం రూ.12.20లక్షలతో ఆర్వో ప్లాంట్ నిర్మించి ప్రారంభించారు. జంగంరెడ్డిపల్లెలో ఫ్లోరిన్ నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే శుద్ధిజలం అందించేందుకు అప్పటి ప్రభుత్వం ఆర్వోప్లాంట్ నిర్మించింది. కానీ ప్రారంభించిన నెలరోజుల మాత్రం ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందజేశారు. ఆ తర్వాత ఆర్వోప్లాంట్‌ను పంచాయ తీకి అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూత పడింది. దీంతో పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఆ గ్రామ ప్రజలకు ఫ్లోరిన్ నీరే దిక్కుయింది. పంచాయతీ అధికారులు మాత్రం ఆర్వోప్లాంట్‌ను మరిచారు. ఆ గ్రామంలో తీవ్ర మంచినీటి ఎద్దడి ఉంది. అప్పట్లో ఆర్వో ప్లాంట్‌కు ఒక డీప్ బోర్ ద్వారా కనె క్షన్ ఇచ్చారు. ఆ డీప్ బోరు ప్రస్తు తం అరకొరగా వస్తోంది. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా ఆ గ్రామంలో నీరు అందిస్తున్నారు. కొందరు విధిలేని పరిస్థితుల్లో కలుజువ్వలపాడు నుంచి శుద్ధిజలం తెచ్చుకొని తాగుతున్నారు. గ్రామం లో ఆర్వో ప్లాంట్ ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉండటంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్ప డం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామంలోని ప్రజలు కోరుతున్నారు.
పెద్దదోర్నాల : విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్‌వో ప్లాంట్లు ప్రారంభించకుండానే మూలన పడ్డాయి .దీంతో విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు లక్షల రూపాయాల ప్రజాధనం వృథా అయ్యింది. నాడు-నేడు పథకంలో భాగంగా ప్రభుత్వం మొదటి విడతలో మండలంలోని 39 పాఠశాలలకు ఆర్‌వో ప్లాంట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టు తీసుకున్న ఏజన్సీలు పాఠశాలలకు ప్లాంటుకు సంబంధించిన వస్తు సామగ్రిని తరలించా రు. కాని నిర్వహణ బాధ్యతను వదిలేశారు. దీంతో ఐదేళ్లయి నా, నేటికీ ఒక్కంటే ఒక్క ప్లాంటు వినియోగంలో లేదు. ప్రధానంగా అటవీ ప్రాంతం లోని ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు అత్యవ సరం. కొండప్రాంతం, కాలువ లు, వాగుల్లోని నీటిని తాగడం వల్ల రోగాలభారిన పడకుండా ఉండేందుకు రక్షిత మంచినీటి పథకాన్ని అమలు చేశారు. కాని ప్రారంభంచడం మరిచారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. విద్యార్థులు మాత్రం తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొం టూనే ఉన్నారు. పలువురు విద్యార్థులు ఇంటివద్ద నుంచే నీళ్లసీసాలను తీసుకువెళుతున్నారు. సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులు పలుమార్లు, ఉన్నతాఽ దికారులకు చెప్పినా ఫలితం లేదని చెబుతు న్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత ఉన్నతాధిక ారులుస్పందించి తగినచర్యలు చేపట్టాలని, విద్యార్థులకు మంచినీటిని అందించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు.