Share News

ఒంగోలులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Aug 09 , 2024 | 12:56 AM

ఒంగోలులో విమానశ్రయం ఏర్పాటు చేయాల ని గురువారం పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కోరారు.

ఒంగోలులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలి

ఎంపీ మాగుంట

ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 8: ఒంగోలులో విమానశ్రయం ఏర్పాటు చేయాల ని గురువారం పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో విమనాశ్రయాల సంఖ్య దేశంలో 150కు చేరుకున్నాయన్నారు. దేశంలో 75శాతం ప్రయాణికులు మూడు కంపెనీల విమానాల్లోనే ప్రయాణిస్తున్నారని చెప్పారు. విమానయాన టి క్కెట్‌ ధరలు తగ్గడంతో పేద, మధ్యతరగతి ప్రజలు సైతం విమానాల్లో ప్రయాణా లు చేస్తున్నారని తెలిపారు. 20 ఏళ్లక్రితం ఒంగోలులో విమానశ్రయం ఏర్పాటుకు 650 ఎకరాలను సంబంధిత బృందం పరిశీలించిందని, దీనిపై ఆనాడే సంబంధిత శాఖ అధికారులు సైతం ఆమోదించినట్లు గుర్తుచేశారు. కేంద్రం 60 శాతం నిధులి స్తే రాష్ట్రం 40శాతం నిధులతో నూతన విమానశ్రయాల ఏర్పాటుకు ముందుకు వెళ్లే అవకాశం ఉందని మాగుంట పేర్కొన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 12:56 AM