Share News

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:14 AM

పట్టణంలోని అభిలాష్‌ మిని ఫంక్షన్‌ హాలులో జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల 1985 బ్యాచ్‌ 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వ హించారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

గిద్దలూరు, జూలై 14 : పట్టణంలోని అభిలాష్‌ మిని ఫంక్షన్‌ హాలులో జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల 1985 బ్యాచ్‌ 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వ హించారు. 4 దశాబ్దాల తరువాత 80 మంది విద్యార్థులు సమ్మేళనం కార్యక్రమానికి హాజరై ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. గురు వులను సన్మానించారు. నాటి మిత్రుడు పేద రికంతో ఉండగా రూ.40వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థుల సంఘం ప్రతినిధులు ముత్తుముల రంగారెడ్డి, మేకబోయిన గురుప్రసాద్‌, గుర్రం శోభన్‌బాబు, పిడతల పవన్‌కుమార్‌, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 12:14 AM