Share News

కూటమి గెలుపు..అభివృద్ధికి మలుపు

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:50 PM

నియోజకవర్గంలో కూటమి గెలుపు.. అభివృద్ధికి మలుపు అని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండ య్య అన్నారు. కూటమితో సుపరిపాలన అం దుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, తదుగుణంగా అందరం సమిష్టి కృషితో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా తెన్నేటి కృష్ణప్రసాద్‌ను సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కొండయ్య పిలుపునిచ్చారు.

కూటమి గెలుపు..అభివృద్ధికి మలుపు
బీజేపీ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య

ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య

చీరాల, ఏప్రిల్‌ 27 : నియోజకవర్గంలో కూటమి గెలుపు.. అభివృద్ధికి మలుపు అని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండ య్య అన్నారు. కూటమితో సుపరిపాలన అం దుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, తదుగుణంగా అందరం సమిష్టి కృషితో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా తెన్నేటి కృష్ణప్రసాద్‌ను సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కొండయ్య పిలుపునిచ్చారు. శనివారం రోటరీ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన బీజేపీ ఆత్మీయ సమావేశంలో కొండయ్య, ఎంపీ అభ్య ర్థి కృష్ణప్రసాద్‌ కుమార్తె రమ్య, డాక్టర్‌ సజ్జా హేమత ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాష్ట్రం తిరిగి అభివృద్ధి ప ధంలో నడవాలంటే చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకతను వి వరించారు. సూపర్‌సిక్స్‌ పథకాలు, బీసీ డిక్లరేషన్‌తో ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. చీరాల ని యోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు, తమను ప్రజలు ఎన్నుకునేందుకు చూపుతున్న ఆసక్తి మనకు సానుకూల అంశాలన్నారు. ఈ క్ర మంలో ఓటు వేసే వరకూ కూటమి పార్టీల ఓ టర్లతో పాటు, తటస్తులు మనతో కలిసి ప్ర యాణించేలా చైతన్యవంతుల్ని చేయాలన్నారు. ఈ సందర్భంగా కొండయ్యను ఎమ్మెల్యే అభ్యర్థిగా, కృష్ణప్రసాద్‌ను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని తీర్మానం చేశారు. అనంతరం అతిథుల ను సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరరావు, బీజేపీ నాయకులు మువ్వల వెంకటరమణారావు, ప్ర ముఖ న్యాయవాది బండారుపల్లి హేమంత్‌కుమార్‌, నాసిక మణికుమార్‌, కాకర్ల వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు మామిడాల శ్రీనివాసరావు, కారంపూడి పద్మిని, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:50 PM