Share News

దుర్మార్గ పాలన అంతానికే కూటమి పోరాటం

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:35 PM

జగన్‌రెడ్డి దుర్మార్గ పాలనను అంతం చేసేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోరాటం చేస్తోందని కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉద్ఘాటించారు. మంగళవారం ఇంకొల్లు, పావులూరులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా పావులూరి ఆంజనేయస్వామి గుడిలో ఏలూరి పూజలు చేశారు.

దుర్మార్గ పాలన అంతానికే కూటమి పోరాటం
బీసీలనుద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఏలూరి

పేదల కోసం పుట్టిన పార్టీ టీడీపీ

జయహో బీసీలో ఎమ్మెల్యే ఏలూరి

ఇంకొల్లు ప్రచారంలో మహిళల బ్రహ్మరథం

ఇంకొల్లు, ఏప్రిల్‌ 16 : జగన్‌రెడ్డి దుర్మార్గ పాలనను అంతం చేసేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోరాటం చేస్తోందని కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉద్ఘాటించారు. మంగళవారం ఇంకొల్లు, పావులూరులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా పావులూరి ఆంజనేయస్వామి గుడిలో ఏలూరి పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు ఏలూరికి బ్రహ్మరథం పట్టారు. హారతలిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఇంకొల్లులో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఏలూరి మాట్లాడారు. బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమన్నారు. పేదల కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీకి ప్రజలు మద్దతు తెలపాలన్నారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ ఇంకొల్లులో ఆటోనగర్‌ను ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. పావులూరులో ఇంటి స్థలాల సమస్యను పరిష్కరిస్తానన్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలను అమలు చేసి పేదల సంక్షేమానికి పాటుపడతానన్నారు. ఇంకొల్లులో స్టాలిన్‌పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈనెల 22న నా నామినేషన్‌ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచీ తరలివచ్చి ఆశీర్వదించాలని ఏలూరి కోరారు. స్టాలిన్‌పేట చర్చిలో ప్టాస్టర్లు ఏలూరి గెలవాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఇంకొల్లుకు చెందిన వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు అయోషాబుడే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు రామకృష్ణ, పెదపూడి విజయకుమార్‌, బీసీ నాయకులు గుంజి వెంకట్రావు, వీరగంధం, బాబర్‌, శ్యాం, రఫీ, బట్టు శ్రీనివాసరావు, బేతపూడి, పాలేరు రామకృష్ణ, కరి శ్రీను, వలేరు మార్క్స్‌ పాల్గొన్నారు.

మైనారిటీలకు ఆటోనగర్‌ని ఏర్పాటు చేస్తా

గొట్టిపాటినగర్‌లో షాదీఖానాకు కృషి : ఎమ్మెల్యే ఏలూరి

వైసీపీని వీడి టీడీపీలో చేరిన 20 కుటుంబాలు

మార్టూరు, ఏప్రిల్‌ 16 : మార్టూరు గ్రామంలో మైనారిటీలకు ఆటో నగర్‌ని ఏర్పాటు చేస్తానని, గొట్టిపాటినగర్‌లో షాదీఖానా నిర్మాణానికి కృషి చేస్తానని కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హామీ ఇచ్చారు. మంగళవారం మార్టూరు గ్రామంలోని గొట్టిపాటినగర్‌కు చెందిన 20 మైనారిటీ కుటుంబాలు వైసీపీని వీడి ఏలూరి క్యాంప్‌ కార్యాలయంలో టీడీపీలో చేరాయి. వారందరికీ ఎమ్మెల్యే ఏలూరి కండువాలను వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ గొట్టిపాటినగర్‌లో కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఇంకొల్లు మైనారిటీలకు ఆటోనగర్‌ని ఏర్పాటు చేస్తానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పర్చూరు, మార్టూరులో ఆటోనగర్‌ల నిర్మాణం చేపడతానన్నారు. నియోజకవర్గంలో అన్ని చోట్లా కబ్రస్థాన్‌ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతానన్నారు. నియోజకవర్గంలో 25 వేల మంది పేదలకు 2 సెంట్ల స్థలాన్ని ఇస్తామన్నారు. పార్టీలో చేరినవారిలో షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ సుభాని, షేక్‌ కాలేషావలి, షేక్‌ కరీంబాషా, సోడాగుడి అజయ్‌, షేక్‌ బాజి, షేక్‌ సుభాని, షేక్‌ బాజి, పఠాన్‌ ఉమర్‌ అహ్మద్‌, షేక్‌ నాగూర్‌ వలి, షేక్‌ సుభాని, షేక్‌ జిలాని, షేక్‌ గౌస్‌, పఠాన్‌ బాజి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు షేక్‌ రజాక్‌, షేక్‌ ఫరూక్‌, ఉస్మాన్‌, జిలాని, సుభాని పాల్గొన్నారు.

ఏలూరిని గెలిపించండి.. మహిళల ప్రచారం

ఎమ్మెల్యేగా మూడోసారి ఏలూరి సాంబశివరావును గెలిపించాలని మంగళవారం కిషోర్‌కాలనీలో టీడీపీ మహిళా కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కిషోర్‌ కాలనీలో ఏలూరి చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, సమస్యలు పరిష్కారం కావాలంటే తిరిగి ఏలూరిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు. రాష్ట్రం బాగు కోసం బాబును ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వెనుక కాలనీలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉప్పుటూరి రమాదేవి, అరుణ కస్తూరి, రాధ, జంపని శ్రీను, తాటి నాగేశ్వరరావు, పుట్టా శ్రీను, కాకోలు వెంకటేశ్వర్లు, గన్నవరం బుడే, గొట్టిపాటి వెంకట్రావు కమ్మ శివనాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:35 PM