Share News

పోలింగ్‌కు సర్వం సిద్ధం

ABN , Publish Date - May 12 , 2024 | 11:05 PM

సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో అద్దంకి పట్టణంతో పాటు 5 మండలాలలో 298 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి పోలింగ్‌ అధికారులతో పాటు మొత్తం 6గురు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇక ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద కనీసం ఒకరు కు తగ్గకుండా పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

పోలింగ్‌కు సర్వం సిద్ధం
అద్దంకి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పోలింగ్‌ సామగ్రితో ఉన్న సిబ్బంది

కేంద్రాలకు సామగ్రితో చేరిన సిబ్బంది

డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్‌ వద్దకు బస్సులు

వచ్చే అవకాశం లేక అవస్థలు

పోలీసుల బందోబస్తు

అద్దంకి, మే 12 : సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో అద్దంకి పట్టణంతో పాటు 5 మండలాలలో 298 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి పోలింగ్‌ అధికారులతో పాటు మొత్తం 6గురు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇక ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద కనీసం ఒకరు కు తగ్గకుండా పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. సెక్టార్‌ ఆఫీసర్‌లు, మొబైల్‌ టీమ్‌లు కూడా విధులు నిర్వహించనున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నుంచి ఎన్నికల సిబ్బందిని కేటాయించడంతో మధ్యా హ్నం వరకు వస్తునే ఉన్నారు. రిజస్ర్టేషన్‌ కౌటర్‌ వద్ద సరైన వసతులు లేకపోవడంతో పోలింగ్‌ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఇక సాయంత్రం 4 గంటల నుంచి డి స్ర్టిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి సిబ్బంది పోలింగ్‌ సిబ్బంది వారికి కేటాయించిన వాహనాలలో తరలివెళ్లారు. డి స్ర్టిబ్యూషన్‌ సెంటర్‌ వద్దకు బస్సులు వచ్చే అవకాశం లేకపోవడంతో బంగ్లా రోడ్డులోనే బారులు తీరాయి. దీం తో సిబ్బంది డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి బంగ్లా రోడ్డు వరకు పోలింగ్‌ సామగ్రితోపాటు తమ లగేజీని తీసుకువచ్చేందుకు ఇబ్బంది పడ్డారు. మహిళా ఉద్యోగులు మరింత ఇబ్బంది పడ్డారు. ఆయా రూట్‌లకు సిబ్బం దిని వాహనాలలో పంపేందుకు సరైన ప్రణాళిక లేకపోవడంతో మరింత ఆలస్యం అయింది. దీంతో సిబ్బంది మరింత అసహనానికి గురయ్యారు.

144 సెక్షన్‌ అమలు

బల్లికురవ : సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని గ్రామాలలో 144 సెక్షన్‌ అమలులో ఉందని ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని బల్లికురవ ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి కోరారు. ఆదివారం ఎస్‌ఐ మాట్లాడుతూ మండలంలోని 21 పంచాయతీలలో ఉన్న పో లింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారని ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియెగించుకోవాలన్నారు. ఎక్కడైనా ఎవరైనా పోలింగ్‌ బూత్‌ల వద్ద ఘర్షణలకు దిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. పోలింగ్‌ నిర్వహణకు ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేశామన్నా రు. ఫ్యాక్షన్‌ గ్రామం వేమవరంలో వెబ్‌ కెమెరాల ద్వా రా ఓటింగ్‌ జరుగుతుందన్నారు. అలానే రౌషీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పోలింగ్‌ కేద్రానికి రెండు వందల మీటర్ల దూరం ఎవరు ఉండరాదని అయన తెలిపారు. అలానే పలు రూట్లలో పోలీ సు సిబ్బందిని ఏర్పాటు చేశామని ఎక్కడైన ఎవైన గొడవలు జరిగితే వెంటనే పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.

పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

చీరాల : పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు అన్ని పూర్తి చేసినట్లు ఈఆర్వో సూర్యనారాయణరెడ్డి తెలిపారు. సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం పోలింగ్‌ అధికారులు, పోలీసులకు ఎన్నికల నియమావళి, విధి నిర్వహణపై అవగాహన శిక్షణలో భాగంగా అధికారులు దిశానిర్దేశం చేశారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. పోలీస్‌ శాఖ పరంగా డీఎస్పీ బేతపూడి ప్రసాద్‌ పోలింగ్‌ రోజు పోలీస్‌ అధికారులు, సిబ్బంది తీసుకోవల్సిన జాగ్రత్తలు, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ జరిగేందుకు చేపట్టాల్సిన అంశాలను వివరించారు. పీవోలు, ఏపీవోలకు తమ, తమ ఎన్నికల సామగ్రిని అందజేశారు. ఎన్నికల ఏ ర్పాట్లకు సంబంధించి ఈఆర్వో సూర్యనారాయణరెడ్డి మా ట్లాడుతూ మొత్తం పోలింగ్‌ ప్రక్రియలో భాగంగా పోలింగ్‌ బూత్‌లకు వెళ్లేందుకు 22 రూట్లు నిర్దేశించామన్నారు. పీవోలు, ఏపీవోలతోపాటు ఓపీవోలు మొత్తం 1239 మంది పోలింగ్‌ ప్రక్రియలో విధులు నిర్వహిస్తారన్నారు. పోలింగ్‌ అధికారులకు తగిన శిక్షణ ఇచ్చి ఈవీఎంలు, ఇతర పోలింగ్‌ సామగ్రిని అందజేశామన్నారు. పోలింగ్‌ అధికారులు, మెటీరియల్‌ తరలింపుకు 20 ఆర్టీసీ బస్సులు, 43 ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం రాత్రికి పోలింగ్‌ అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ బూత్‌లకు చేరుకుంటారన్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 218 బూత్‌లు ఉన్నాయన్నారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద మహిళలకు, పురుషులకు వేర్వేరుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద ర్యాంప్‌లు ఏర్పాటు చేపించామన్నారు. అలానే ఎండల తీవ్రత నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లకు ఇబ్బంది లేకుండా షామియాలనాలు, మంచినీటి వసతి కల్పించామన్నారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

295 కేంద్రాల ఏర్పాటు

పర్చూరు : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పగడ్బందీగా చేశారు. దీనికి సంబంధించి ఆదివారం బీఏఆర్‌ అండ్‌ టీఏ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో సిబ్బందికి అవరసమైన ఈవీఎం, వీవీప్యాడ్స్‌ తదితర సామగ్రిని అందజేశారు. ఆయా సెక్టార్‌ పరిధిలోని ఎన్నికల కేంద్రాలకు బూత్‌లవారీగా పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో వాహనాల్లో సిబ్బందిని తరలించారు. ఆయా గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను పంచాయతీ, రెవెన్యూ సారథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు 295 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్వో గంధం రవీందర్‌ తెలిపారు. దీనికి సంబంధించి 3500 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. పోలీసు సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణలో సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. మైక్రో అబ్జర్వర్‌, వెబ్‌కేమ్‌తో పాటు, నేరుగా సీఈవో కంట్రోల్‌ రూంకు సమాచారం అందేలా వెబ్‌కేమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 53 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 2,29,333 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషలు 1,11,865, మహిళలు 1,17,462, ఇతరులు 6గురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉందన్నారు.

నేడు పోలింగ్‌

మార్టూరు : సోమవారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మార్టూరు మం డలంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు, పోలింగ్‌ సిబ్బందికి, ఏజెంట్లకు ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రికి పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులను తరలించారు. మండలంలో 72 పోలింగ్‌ బూత్‌లున్నాయి. మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు చెందిన 57121 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద విద్యుత్‌ సౌకర్యం, తాగునీరు. ఎండల దృష్టా షామియానులను ఏర్పాటు చేశారు. అంతేగాకుండా ఓటర్లుకు ముఖ్యంగా మహిళలతో సహా ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. కేంద్రాలను ఎంపీడీవో నితిన్‌ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ పోలింగ్‌ కేంద్రాల వద్దకు పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు వేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు మార్టూరు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. మండలంలో మేజర్‌ పంచాయతీ మార్టూరులో అధికంగా 19 పోలింగ్‌ కేంద్రాలు వలపర్ల గ్రామంలో 11 పోలింగ్‌ బూత్‌లున్నాయి.

ఇంకొల్లు : మండలంలోని 13 పంచాయతీలలో 20 గ్రామాలలో 54 పోలింగ్‌ కేంద్రాలలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆదివారం పోలింగ్‌ కేంద్రాలను ఎంపీడీవో శ్రీదేవి పరిశీలించారు. ఎన్నికల సిబ్బంది ఆయా కేంద్రాలకు ఆదివారం సాయంత్రానికి చేరుకున్నారు. ఇంకొల్లు పంచాయతీ పరిధిలో 17 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హనుమోజిపాలెంలో ఒకటి, గొల్లపాలెంలో రెండు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ మల్లికార్జునరావు కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సిబ్బందితో పకడ్బందీ చర్యలు చేపట్టారు.

Updated Date - May 12 , 2024 | 11:05 PM