పోలింగ్‌కు సర్వం సిద్ధం!
ABN , Publish Date - May 12 , 2024 | 11:02 PM
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధంచేశారు. నియోజక వర్గంలోని 297 పోలింగ్ కేంద్రాలకు 60 రూట్లకు పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించేందుకు ఆదివారం చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాటకై ఆదేశాలు జారీ చేయగా స్థానిక ఆర్‌ఓ జాన్‌ఇర్విన్ ఏర్పాట్లు పూర్తి చేశారు. కనిగిరి పట్టణ సమీపంలోని వ్యవసాయమార్కెట్ యార్డును పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి డిస్ట్రి బ్యూషన్ కేంద్రంగా కేటాయించారు.

మండుటెండలో ఇబ్బందిపడిన పోలింగ్ సిబ్బంది
సౌకర్యాల లేమితో ఉద్యోగుల ఇబ్బందులు
వసతులులేక ఉద్యోగినుల అవస్థలు
సామగ్రితో కేంద్రాలకు చేరిక
కనిగిరి, మే 12: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధంచేశారు. నియోజక వర్గంలోని 297 పోలింగ్ కేంద్రాలకు 60 రూట్లకు పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించేందుకు ఆదివారం చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాటకై ఆదేశాలు జారీ చేయగా స్థానిక ఆర్‌ఓ జాన్‌ఇర్విన్ ఏర్పాట్లు పూర్తి చేశారు. కనిగిరి పట్టణ సమీపంలోని వ్యవసాయమార్కెట్ యార్డును పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి డిస్ట్రి బ్యూషన్ కేంద్రంగా కేటాయించారు. ఒక్కో పోలింగ్ కేం ద్రానికి వివిధ విభాగాల్లో విధులు నిర్వహించేందుకు ఆరు గురు చొప్పున కేటాయించారు. దీంతో కనిగిరి నియోజక వర్గంలో 1782 మంది పోలింగ్ సిబ్బందితో పాటు అద నంగా మరో 250 మందిని అత్యవసర విధులకై రిజర్వు డులో ఉంచారు. అలాగే, దాదాపు 500 మందికి పైగా పోలీసు సిబ్బంది, ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మరో 150 మందిని కేటాయించారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద భోజన ఏర్పాట్లను, విధుల కు హాజరయ్యే సిబ్బంది, ఉద్యోగులు వసలతుల కల్పనను పర్యవేక్షించేందుకు మరో వంద మందిని కేటాయించారు. మున్సిపల్ సిబ్బంది మరో వంద మంది విధులు నిర్వర్తించారు. దాదాపు 2500 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బది 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పో లింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వ ద్దకు ఉదయం పది గంటలలోపు చేరుకు న్నారు. ఆయా రూట్ల వారీగా మెటీరియల్ పంపిణీ చేశా రు. రిటర్నింగ్ అధికారి జాన్‌ఇర్విన్ పోలింగ్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. సోమవారం ఉదయాన్నే 5.30 గంటలకు తప్పనిసరిగా మాక్ పోలింగ్ చేసి 7 గంటలు నుంచి పోలింగ్ ప్రారంభించాలని సూచించారు.
సౌకర్యాల లేమితో సిబ్బంది అవస్థలు
ఎండల తీవ్రత అధికంగా ఉండటం, ఉక్కపోతతో సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎండ వేడిమికి పలువురు ఇబ్బందులు పడ్డారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద సరిపడిన టెంట్లు వేయకపోవటంతో మండుటెండలో టెం ట్లు అంచున సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు. మ ధ్యాహ్నం 12.30 గంటలకే భోజన వసతి ఏర్పాట్లు పూ ర్తికావాల్సి ఉండగా, 1.30కు కూడా భోజనాలు పూర్తి కాలే దు. మహిళా సిబ్బందికి కేటాయించిన భోజనస్టాల్ వద్ద మహిళలు భోజనం కోసం నిరీకించాల్సి వచ్చింది. అలాగే, టాయిలెట్స్ సరిగాలేక ఇబ్బందులు పడ్డారు.
పోలింగ్ కేంద్రాలకు తరలిన పోలీసు బలగాలు
పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. నియోజక వర్గంలోని 297 పోలింగ్ కేంద్రాల వద్ద సుమా రుగా వివిధ స్థాయిలో గల 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించారు. సీఐ, ఎస్‌ఐల ఆధ్వర్యంలో 50 మొబైల్ పోలీసుపా ర్టీలు ఎన్నికల శాంతిభద్రతలకు వినియోగిస్తున్న ట్టు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. పోలింగ్ సందర్భంగా డీఎస్పీ రామరాజు ఆదివారం బం దోబస్తును పర్యవేక్షించారు. సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలైన కనిగిరి మం డలంలోని యడవల్లి, హనుమంతునిపాడు మండలం లోని హాజీపురం వద్ద బందోబస్తును పకడ్బందీగా ఏర్పా టుచేశారు. ఏ పోలింగ్ కేంద్రంలోనైనా సమస్య వచ్చినా వెంటనే మొబైల్‌పార్టీలు అక్కడికి చేరుకునేలా అధికారు లు చర్యలు చేపట్టారు. మొబైల్ పార్టీలతో పాటు సీఆర్పీ ఎఫ్ బలగాలు బందోబస్తులో పాల్గొననున్నాయి.
దర్శిలోనూ అన్నిఏర్పాట్లు
దర్శి, మే 12: దర్శి నియోజకవర్గంలో సోమవారం జరి గే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక మోడల్ స్కూల్ నుంచి పోలింగ్ మెటీరియల్‌ను ఎన్నికల రిట ర్నింగ్ అధికారి ఎంవీవీఎస్ లోకేశ్వరరావు ఆధ్వర్యంలో అ ధికారులకు పంపిణీ చేశారు. దర్శి నియోజకవర్గంలో మొ త్తం 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. నియోజ కవర్గంలో 27 సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ క్యాస్టింగ్ సీసీ కెమెరాలు అమర్చారు. మొత్తం రెండు వేలకు పైగా సిబ్బంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. 312 మంది ప్రిసైడింగ్ అధికారులు, 312 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 43 మంది సెక్టార్ అధికారులు, 58 మంది రూట్ అధికారులతో పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు
పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేశ్వర రావు తెలిపారు. 12మంది సీఆర్‌పీఎఫ్ అధికారులు, తమిళనాడు నుంచి వంద మంది స్పెషల్ పోలీస్ బెటా లియన్, 76 మంది బార్డర్ సెక్యూరిటీ దళాలు, మరో వంద మంది ఇతర సిబ్బంది అదనంగా దర్శి నియోజకవర్గానికి నియమించినట్లు చెప్పారు. ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు. స్వేచ్ఛగా నిర్భయంగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించు కోవాలని కోరారు. ఎవరైనా ఆటంకాలు కల్పించినా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.