వైసీపీ పాలనలో ఐదేళ్లూ అవరోధాలే..!
ABN , Publish Date - May 12 , 2024 | 11:11 PM
వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అవరోధాలే తప్ప ఎలాంటి అభివృద్ధి లేదని, ప్రజలకు ఈ ఎన్నికలే సరైన అవకాశమని.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని టీడీపీ ప్రజా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం ఏలూరి క్యాంపు కార్యాలయంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఏలూరి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు.

ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలి
భవిష్యత్ తరాలకు ఇదే కీలకఘట్టం 8 ఎమ్మెల్యే ఏలూరి
పర్చూరు, మే 12 : వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అవరోధాలే తప్ప ఎలాంటి అభివృద్ధి లేదని, ప్రజలకు ఈ ఎన్నికలే సరైన అవకాశమని.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని టీడీపీ ప్రజా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం ఏలూరి క్యాంపు కార్యాలయంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఏలూరి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా ఏలూరి మాట్లాడుతూ ఐదేళ్ల పాటు అనేక సమస్యలతో సతమతమై ఇబ్బందులు పడ్డ ప్రజలంతా భావితరాల భవిష్యత్ కోసం ఓటు అనే వజ్రాయుధంతో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. యువ ఓటర్లంతా బంగారు భవిష్యత్ కోసం ముందుకు సాగాలన్నారు. అపార రాజకీయ అనుభం, విజన్ ఉన్న చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి మంచురోజులు రానున్నాయని, దీనికి ప్రజలు ఓటు హక్కుతో అవకాశం కల్పించాలన్నారు. ప్రజా కూటమి అనూహ్య రీతిలో భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పర్చూరు ప్రజల ఆకాంక్షను తీర్చేలా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పధంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.