Share News

పరీక్షలు అంతా ‘ఓపెన్‌’

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:40 AM

ద్యార్థులు, వివిధ ప్రైవే ట్‌ ఉద్యోగులకు ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమా న్యాలు యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నాయి.

పరీక్షలు అంతా ‘ఓపెన్‌’

పొదిలి, మార్చి 17 : విద్యార్థులు, వివిధ ప్రైవే ట్‌ ఉద్యోగులకు ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమా న్యాలు యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఓపెన్‌ పరీక్షల పేరుతో పదవతరగతి, ఇంటర్‌ ధ్రువీకరణ పత్రాల వారి అవసరాలను నిర్వహ కులు విచ్చలవిడిగా సొమ్ము చేసుకుంటున్నారు. ముందుగా పరీక్షలకు హాజరయ్యేవారికి అను మతులు ఉన్న విద్యాసంస్థలు, మద్యవర్తుల ద్వారా గ్యారెంటీ పాస్‌ అనే ఆశ చూపుతున్నారు. పరీక్షకు హాజరైతే చాలు అన్ని తాము చూసుకుంటామని భరో సా ఇస్తున్నారు. ఎంపిక చేసు కున్న కేంద్రాలలో ప్రణాళిక ప్రకారం ముందుగానే కావలసిన వారిని ఇన్విజిలే టర్లుగా నియమించుకుంటున్నారు. ఆ క్రమంలో ఒకరికి బదులు మరొకరితో పరీక్షా పత్రాలు రాయించేందుకు సర్వసిద్ధం చేసుకుం టునారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమోషన్‌ల కోసం విద్యా ర్హతల కోసం అవసరమైన చిరుద్యోగులు అధికంగా ఈ ఓపెన్‌ పరీక్షలకు హాజరౌతుంటారు. వీరి అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు కొంత మంది కోటరీగా ఏర్పడి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. విద్యాశాఖ అధికారులు సైతం పరీక్షల నిర్వహణ౅ పౖ సరైన దృష్టి సారించడం లేదనే అనుమానాలు వ్యక్తం చేస్తు న్నారు. ఈ ఏడాది ఇంటర్‌, పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం పొదిలి జూనియర్‌ కాలేజి, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఇంటర్‌, జడ్పీ హైస్కూల్‌లో పదవ తరగతి పరిక్షలు నిర్వహించేందుకు కేంద్రాలను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికైనా సంబం ధిత అధికారు లు దృష్టి సారించి పరీక్షల ప్రక్రియ అపహాస్యం కాకుండా చూడాలని పులువురు కోరుతున్నారు.

Updated Date - Mar 18 , 2024 | 12:40 AM