Share News

అజరామరం.. ప్రకాశం

ABN , Publish Date - Aug 24 , 2024 | 01:11 AM

అటు స్వాతంత్య్ర పోరాటంలోనూ, ఇటు రాష్ట్ర అభివృద్ధిలోనూ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పోషించిన పాత్ర అజరామరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి అన్నారు.

అజరామరం.. ప్రకాశం
ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద ఉన్న ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల, కలెక్టర్‌ అన్సారియా తదితరులు

రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం

మంత్రి డాక్టర్‌ స్వామి

ఆంధ్రకేసరికి ఘన నివాళి

ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 23 : అటు స్వాతంత్య్ర పోరాటంలోనూ, ఇటు రాష్ట్ర అభివృద్ధిలోనూ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పోషించిన పాత్ర అజరామరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి అన్నారు. ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని ఆయన విగ్రహానికి శుక్రవారం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాతో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి ఆయన మునిమనుమడు సంతోష్‌ కుమార్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన కార్యక్రమంలో మంత్రి స్వామి మాట్లాడుతూ ఆంధ్రకేసరి సంపాదించినదంతా దేశసేవ కోసమే వెచ్చించిన మహనీయుడని కొనియాడారు. స్వాతంత్య్ర పోరాటంలో క్విట్‌ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి వాటిలో ప్రకాశం పంతులు పాత్ర ఎంతో ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు ఎన్నో మంచి పనులు చేశారని కొనియాడారు. కలెక్టర్‌ తమీమ్‌ అన్సారి యా మాట్లాడుతూ బ్రిటీష్‌ పాలకుల తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి ప్రకాశం పంతులు అని కీర్తించారు. లక్ష్య సాధనలో నేటి యువత ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్‌ గంగాడ సుజాత, ఒంగోలు ఆర్డీవో సుబ్బారెడ్డి, ఏఎస్పీ కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 01:11 AM