Share News

ఖరీ్‌ఫకు కార్యాచరణ

ABN , Publish Date - May 29 , 2024 | 11:28 PM

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందింది. సుమారు 1,54,739 హెక్టార్ల విస్తీర్ణంలో 20 రకాల పంటల సాగు ద్వారా 1,66,569 మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఖరీ్‌ఫకు కార్యాచరణ

వ్యవసాయ శాఖ ప్రణాళిక

1.54 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు

1.66 లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా

కంది, పత్తి, వరి ప్రధాన పంటలు

57,647 టన్నుల ఎరువులు అవసరమని ప్రతిపాదన

సబ్సిడీపై 8,893 క్వింటాళ్ల విత్తనాలు

ఒంగోలు, మే 29 (ఆంరఽధజ్యోతి) : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందింది. సుమారు 1,54,739 హెక్టార్ల విస్తీర్ణంలో 20 రకాల పంటల సాగు ద్వారా 1,66,569 మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుంది. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 1,38,877 హెక్టార్లు కాగా ఈ ఏడాది మరో పది శాతం పెరిగి 1,54,739 హెక్టార్లలో సాగు అంచనా వేశారు. అందులో సగానికి పైగా విస్తీర్ణంలో కంది ఉండనుంది. తర్వాత పత్తి, వరి పంటలు సాగుకానున్నాయి. మొత్తం సాగు విస్తీర్ణంలో మూడింట రెండొంతులు ఆహార పంటలు. ఇదిలా ఉండగా ఆయా పంటలకు సంబంధించి సుమారు 8,893 క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందజేయనున్నారు. వరి విత్తనాలు 4వేల క్వింటాళ్లు అవసరంగా గుర్తించారు. వాటిని క్వింటాకు రూ.500 సబ్సిడీపై ఇవ్వనున్నారు. 30శాతం సబ్సిడీపై 2,120 క్వింటాళ్ల అపరాలు, మరో 2,773 క్వింటాళ్ల పచ్చిరొట్ల విత్తనాలను 50శాతం సబ్సిడీపై ఇవ్వాలని ప్రతిపాదించారు.

అందుబాటులో 38,085 టన్నుల ఎరువులు

పంటల సాగుకు సంబంధించి ఖరీఫ్‌ సీజన్‌కు సుమారు 57,647 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరంగా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 30,167 టన్నుల కాంప్లెక్స్‌, 16,153 టన్నుల యూరియా, మరో 11,327 టన్నుల ఇతర ఎరువులు అవసరంగా ప్రతిపాదించారు. అయితే ఇప్పటికే సుమారు 38,085 టన్నుల ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు ప్రకటించారు. ఈఏడాది వర్షాలు సకాలంలో సాధారణం కన్నా ఒకింత అధికంగా కురిసే అవకాశం ఉందన్న సంకేతాలతో రైతులు ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధవుతున్నారు. వ్యవసాయశాఖ కూడా పంట ఉత్పత్తులపై అంచనా వేసింది. మొత్తం 1,54,739 హెక్టార్లలో సాగు ద్వారా 1,66,569 మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తులు జరుగుతాయని భావిస్తోంది.

ప్రధాన ఖరీఫ్‌ సీజన్‌ లక్ష్యాలు ఇలా ఉన్నాయి

జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం : 1,38,877 హెక్టార్లు

ఈ ఏడాది సాగు అంచనా : 1,54,739 హెక్టార్లు

పంట ఉత్పత్తి అంచనా : 1,66,569 మెట్రిక్‌ టన్నులు

పంటలు సాధారణ విస్తీర్ణం ఈ ఏడాది అంచనా

హెక్టార్లలో...

కంది 73003 82154

పత్తి 31562 33000

వరి 14078 15100

సజ్జ 7125 7680

ఇతరాలు 13109 16805

Updated Date - May 29 , 2024 | 11:28 PM