Share News

పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:59 PM

నగరంలో పారిశుధ్యం మెరుగులో నిర్లక్ష్యం వహి స్తే చర్యలు తప్పవని కమి షనర్‌ కె.వెంకటేశ్వరరావు శానిటరీ అధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు.

 పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

శానిటరీ అధికారులపె కమిషనర్‌ సీరియస్‌

ఒంగోలు కార్పొరేషన్‌, న వంబరు 28, (ఆంధజ్యోతి) : నగరంలో పారిశుధ్యం మెరుగులో నిర్లక్ష్యం వహి స్తే చర్యలు తప్పవని కమి షనర్‌ కె.వెంకటేశ్వరరావు శానిటరీ అధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. గురు వారం వార్డుకో వారం కార్య క్రమంలో భాగంగా 15, 21 డివిజన్‌లలో పర్యటించి పారిశుధ్యం పనులు ప రిశీలించడతోపాటు, కాలువల్లో పూడిక తీతపనులు సక్రమంగా నిర్వహించక పోవడంపై ఇన్‌స్పెక్టర్‌ కంకణాల ఆంజనేయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కుబడి పనులు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతిరోజు కాలు వల్లో పూడిక తీత పనులు చేస్తే ఇంత పెద్దమొత్తంలో ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఎందు కు ఉంటాయని ప్రశ్నించారు. అలాగే కనీసం కాలువల్లో పూడిక తీత పనులు సక్రమంగా చేయడం లేదని మండిపడ్డారు. రోజువారీగా రోడ్లు ఊడ్చితే సరిపో దని, ఇకపై కాలువ పూడిక తీత పనులు సక్రమంగా నిర్వహించకుంటే చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సైడు కాలువలపై నిర్మించిన కట్టడాలు, బంకులను తొలగించాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు ఆదేశించారు. కమిషనర్‌ స్వయంగా దగ్గరుండి మరీ పూడిక తీత పనులు పర్యవేక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం మరోసారి కనిపిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఇ న్‌స్పెక్టర్‌ను హెచ్చరించారు. అలాగే అధ్వానంగా ఉన్న కాలువలను గుర్తించి, మురుగునీరు పారుదల మెరుగు కోసం కాలువల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డివిజన్‌ కార్పొరే టర్లు చింతపల్లి గోపి, యనమల నాగరాజు, నాయకులు బాబూరావు, ఎంఈ డీఈ పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:59 PM