Share News

తర్లుపాడు ఎస్‌ఐపై వేటు

ABN , Publish Date - Aug 08 , 2024 | 01:20 AM

తర్లుపాడు ఎస్‌ఐ సుధాకర్‌పై వేటుపడింది. బుధవారం ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎస్పీ చేసిన సూచనలను తిరిగి చెప్పలేకపోయారు.

తర్లుపాడు ఎస్‌ఐపై వేటు

వీఆర్‌కు పిలిచి ఏఆర్‌కు అటాచ్‌మెంట్‌

సెల్‌ కాన్ఫరెన్స్‌లో నిర్లక్ష్యమే కారణం

ఆగ్రహించిన ఎస్పీ దామోదర్‌

ఒంగోలు (క్రైం), ఆగస్టు 7 : తర్లుపాడు ఎస్‌ఐ సుధాకర్‌పై వేటుపడింది. బుధవారం ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎస్పీ చేసిన సూచనలను తిరిగి చెప్పలేకపోయారు. కాన్ఫరెన్స్‌ అనంతరం తాను చెప్పిన విషయాల గురించి దామోదర్‌ ప్రశ్నించగా అసలు వివరణ ఇవ్వలేకపోయారు. ఈ నిర్లక్ష్యాన్ని ఎస్పీ సీరియస్‌గా పరిగణించారు. దీంతో సుధాకర్‌ను జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి ఏఆర్‌కు అటాచ్‌ చేశారు. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కురిచేడు ఎస్‌ఐ శ్రీకాంత్‌, పర్యవేక్షణ లోపం ఉండటంతో త్రిపురాంతకం సీఐ సుబ్బారావును మంగళవారం ఎస్పీ వీఆర్‌ పిలిచారు.

Updated Date - Aug 08 , 2024 | 08:14 AM