డీసీఎంఎస్ కుంభకోణంపై బిగుస్తున్న ఉచ్చు
ABN , Publish Date - Mar 03 , 2024 | 11:39 PM
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎ్‌స)లో జరిగిన ఎరువుల నిధుల గోల్‌మాల్‌పై ఉచ్చుబిగుస్తోంది. ఈ కుంభకోణంపై జిల్లా సహకారాధికారి రాజశేఖర్ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. తాజాగా పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబు విషయాన్ని సీరియ్‌సగా తీసుకొని రాష్ట్ర మార్కెటింగ్, సహకారశాఖల ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరికి ఫిర్యాదు చేశారు. ‘
రంగంలోకి పొగాకు బోర్డు ఈడీ
నివేదిక కోరిన కమిషనర్
ఒంగోలు (విద్య), మార్చి 3 : జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎ్‌స)లో జరిగిన ఎరువుల నిధుల గోల్‌మాల్‌పై ఉచ్చుబిగుస్తోంది. ఈ కుంభకోణంపై జిల్లా సహకారాధికారి రాజశేఖర్ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. తాజాగా పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబు విషయాన్ని సీరియ్‌సగా తీసుకొని రాష్ట్ర మార్కెటింగ్, సహకారశాఖల ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరికి ఫిర్యాదు చేశారు. ‘డీసీఎంఎ్‌స’లో భారీ కుంభకోణం శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్త క్లిప్పింగ్‌ను కూడా ఆయనకు పంపించారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని సహకారశాఖ రాష్ట్ర కమిషనర్ అహ్మద్‌బాబును చిరంజీవిచౌదరి ఆదేశించారు. దీంతో అహ్మద్‌బాబు డీసీవోకు ఫోన్ చేసి నిధుల గోల్‌మాల్‌పై ఆరా తీశారు. ఆయన ఆదేశాల మేరకు డీసీవో ప్రాథమిక నివేదికను పంపారు. సమగ్రంగా విచారణ చేసి 4వతేదీకి నివేదిక సమర్పించాలని డీసీవోను కమిషనర్ ఆదేశించారు.
పొగాకు బోర్డు ఈడీ ఫిర్యాదు
డీసీఎంఎ్‌సలో ఎరువుల నిధుల గోల్‌మాల్‌పై పొగాకు బోర్డు ఎగ్జిక్యూటి డైరెక్టర్ (ఈడీ) అద్దంకి శ్రీధర్‌బాబు ప్రభుత్వ మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరికి ఫిర్యాదు చేశారు. పొగాకు రైతులకు ఎరువులు సరఫరా చేసేందుకు ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్), రైతుల కమిటీ, డీసీఎంఎ్‌సలు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. డీసీఎంఎ్‌సకు ఐపీఎల్ ఎరువులు సరఫరా చేస్తుంది. వాటిని పొగాకు బోర్దు ద్వారా డీసీఎంఎస్ రైతులకు ఇస్తుంది. బోర్డు రైతుల నుంచి ఆ మొత్తాలు వసూలు చేసి డీసీఎంఎ్‌సకు జమ చేస్తోంది. డీసీఎంఎస్ ఆ మొత్తాలను ఒకట్రెండురోజుల్లోనే ఐపీఎల్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే పొగాకు బోర్డు రైతులు చెల్లించాల్సిన మొత్తం నిధులు డీసీఎంఎ్‌సకు జమ చేసి రెండు నెలలవుతున్నా ఇప్పటికీ ఇంకా రూ.72 లక్షలు ఐపీఎల్‌కు చేరలేదు. ఈ మొత్తం గోల్‌మాల్ అయిందని ఈడీ అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని ఐపీఎల్‌కు రూ.72 లక్షలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని శ్రీధర్‌బాబు తన ఫిర్యాదులో చిరంజీవి చౌదరిని కోరారు.
ప్రారంభమైన విచారణ
డీసీఎంఎ్‌సలో ఎరువుల నిధుల గోల్‌మాల్‌పై డీసీవో నియమించిన విచారణాధికారి అయిన ఒంగోలు సబ్ డివిజన్ సహకారాధికారి జె.రామచంద్రనాథ్ విచారణ ప్రారంభించారు. సొసైటీ రికార్డులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. సొసైటీ బ్యాంకు ఖాతాల నుంచి భారీ మొత్తంలో నగదు అకౌంటెంట్ వ్యక్తిగత ఖాతాకు బదిలీ కావడాన్ని విచారణాధికారి గుర్తించారు. ఈ విషయంలో సొసైటీ బిజినెస్ మేనేజర్, అకౌంటెంట్, గుమస్తా, పాలకవర్గాన్ని విచారణాధికారి విచారించనున్నారు.