Share News

సబ్‌ జైలులో న్యాయాధికారి ఆకస్మిక తనిఖీ

ABN , Publish Date - May 29 , 2024 | 12:44 AM

పట్టణంలోని సబ్‌ జైలును జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ.భారతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సబ్‌ జైలులో న్యాయాధికారి ఆకస్మిక తనిఖీ

గిద్దలూరు టౌన్‌, మే 28 : పట్టణంలోని సబ్‌ జైలును జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ.భారతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్‌ జైలులో ఉన్న వసతులను ఆమె క్షుణ్ణంగా పరిశీ లించారు. ఖైదీలకు వండిన ఆహార పదార్థాలను పరిశీలించి సరుకుల నాణ్యతను పరిశీలించారు. ఖైదీలకు అందుతున్న ఆహారం, వైద్య వసతులు, లైబ్రరీ, మంచినీరు, ఇతర సదుపాయాల గురించి ఆరా తీశారు. వారు ఏఏ కేసుల్లో జైలులో ఉన్నా రన్న వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి మాట్లాడు తూ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలే నేరాలకు కారణమౌతాయన్నారు. తద్వారా కుటుంబసభ్యులు ఎంతో వేదన చెందుతారన్నారు. ఎవరూ ఉద్వేగాలకు లోనుకాకుండా సామరస్యంగా సమస్యలను పరిష్క రించుకోవాలన్నారు. తద్వారా సమాజంలో, కుటుంబంలో శాంతి ఉంటుందన్నారు. అరెస్టు, బెయిల్‌ గురించి వివరించారు. స్వతహాగా న్యాయవాదిని ఏర్పాటు చేసుకొనే ఆర్థిక స్థోమత లేనివారికి ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. జైలు అధికారుల ద్వారా సంబంధిత న్యాయసేవా సంస్థ కు అర్జీ పెట్టుకో వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాఽ దికార సంస్థ కార్యదర్శి కె.శ్యాంబాబు, గిద్దలూరు అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయా ధికారి బి.మేరీ సారాదానమ్మ, సబ్‌ జైలు సూపరిం టెండెంట్‌ యు.లింగారెడ్డి, లీగల్‌ ఎయిడ్‌ న్యాయవాది ఎం.పిచ్చయ్య, పారాలీగల్‌ వలంటీర్‌ అద్దంకి మధుసూదన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 12:44 AM