ప్రత్యేక జిల్లాకా.. లేక విధ్వంస వైసీపీ పాలకులకా..?
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:55 PM
వచ్చే ఎ న్నికల్లో మార్కాపురం ప్రజలు ప్రత్యేక జిల్లాకు ఓటు వేస్తారా.. లేక విధ్వంస వైసీపీ పాల కులకు ఓటు వేస్తారో ఆలోచించాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ప ట్టణంలోని 16వ వార్డులో మన కోసం - మన కందుల, భవిష్యత్‌కు గ్యా రెంటీ కార్యక్రమం బుధవారం రాత్రి నాయకు లు, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టు ను జగన్‌రెడ్డి ప్రారం భించడం ప్రజలను మో సగించడమేనన్నారు. ముంపు గ్రామాల ప్రజ ల నోట్లో మట్టి కొట్టార ని వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అంతా ఎన్నికల స్టంట్ అని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నే వెలిగొండ పూర్తవు తుందన్నారు.

ఓటు ఎవరికి వేస్తారో ఆలోచించండి
మాజీ ఎమ్మెల్యే కందుల
మార్కాపురం రూరల్, మార్చి 6: వచ్చే ఎ న్నికల్లో మార్కాపురం ప్రజలు ప్రత్యేక జిల్లాకు ఓటు వేస్తారా.. లేక విధ్వంస వైసీపీ పాల కులకు ఓటు వేస్తారో ఆలోచించాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ప ట్టణంలోని 16వ వార్డులో మన కోసం - మన కందుల, భవిష్యత్‌కు గ్యా రెంటీ కార్యక్రమం బుధవారం రాత్రి నాయకు లు, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టు ను జగన్‌రెడ్డి ప్రారం భించడం ప్రజలను మో సగించడమేనన్నారు. ముంపు గ్రామాల ప్రజ ల నోట్లో మట్టి కొట్టార ని వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అంతా ఎన్నికల స్టంట్ అని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నే వెలిగొండ పూర్తవు తుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పోల్ మేనేజిమెంట్ క్లస్ట ర్ ఇన్‌చార్జి కం దుల రామిరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి వసంత మ్మ, జిల్లా జనసే న పార్టీ ప్రధాన కార్యదర్శి సాధిక్, పట్టణ తె లుగు మహిళలు, పట్టణ టీడీపీ, జనసేన నాయకులు, 16వ వార్డు తెలుగుదేశం-జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
టీడీపీతోనే పేదలకు భరోసా
గిద్దలూరు టౌన్ : తెలుగుదేశం పార్టీతోనే పేదలకు భరోసా కలుగుతుందని 7వ వార్డు కౌన్సిలర్ బిల్లా జయలక్ష్మి అన్నారు. టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదేశాల సూపర్‌సిక్స్‌లో భాగంగా బుధవారం పట్టణంలోని 7వ వార్డులో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌన్సిలర్ బిల్లా జయలక్ష్మి, టీడీపీ నాయకులు బిల్లా రమేష్ ఆధ్వర్యంలో నాయకులు ప్రతి ఇంటింటికీ వెళ్లి చం ద్రబాబు అమలు చేయనున్న సూపర్‌సిక్స్ ప థకాలతో చేకూరే లబ్ధిని మహిళలకు వివరించారు. గతంలో అశోక్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో, ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని బేరీ జు వేసుకోవాలన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పె ట్టుకొని టీడీపీని గెలిపించుకోవాలని వారు ప్ర జలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దుత్తా బాలీశ్వరయ్య, బాలచెన్న య్య, పందీటి ర జని పాల్గొన్నారు. అలాగే న గర పంచాయతీ పరిధిలోని చట్రెడ్డిపల్లెలో ఇం టింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని మాజీ స ర్పంచ్ దప్పిలి విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
విజయమే అజెండాగా పని చేయాలి
పొదిలి : ఎన్నికల్లో టీడీపీ విజయమే అజెండాగా కార్యకర్తలు పనిచేయాలని మాజీ ఎ మ్మెల్యే కందుల నారాయణరెడ్డి కుమారుడు విఘ్నే్‌షరెడ్డి టీడీపీ శ్రేణులను కోరారు. బుధవారం పట్టణంలోని టైలర్స్ కాలనీలో బాబుష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో మాట్లాడారు. చిన్నాభిన్నమైన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు పాలన రావాలన్నారు. ఐదేళ్లలో పాలనలో నవరత్నాల పేరుతో జగ న్‌రెడ్డి ప్రజలను చేశారన్నారు. టీడీపీ అధికా రంలోకి వస్తేనే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెం దుతుందని, వెలిగొండను పూర్తి చేసి సాగు తాగునీటిని అందించే సత్తా చంద్రబాబుకే ఉం దన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి టీడీపీకి పట్టంగట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం టీడీపీ సూపర్‌సిక్స్ పథకాలపై ప్రజలకు అవ గాహన కల్పించారు. కార్యక్రమంలో పట్టణ టీ డీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం
బేస్తవారపేట : టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ మండల అధ్యక్షుడు సోరెడ్డి మో హన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పూనూరు భూ పాల్‌రెడ్డి అన్నారు. బాబు ష్యూరీటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా బుధవా రం మండలంలోని ఎంపీ చెరువు పంచాయతీలోని కొత్తపేట గ్రామంలో ఇంటింటికీ తిరి గి టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను మహిళలకు, ప్రజలకు వివరించారు. టీడీపీ హాయం లో జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. జగన్‌రెడ్డి పాలనలో రౌడీపాలన, అవినీతి పెరిగిపోయిందని, రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తాళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
చింతల అగ్రహారంలో బాబు ష్యూరిటీ
పెద్ద దోర్నాల : మండలంలోని చింతల అగ్రహారం గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్‌టీయూసీ ఒంగోలు పా ర్లమెంటు ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య ఇంటింటికీ వెళ్లీ ప్రజలను కలుసుకుని గత టీ డీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తూ ఈ ప్రభుత్వంలో కోల్పోయి న నష్టాన్ని తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఇక మంచి రో జులు రాబోతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రజా ప్రభుత్వం అధికారంలో కి వస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలెండర్లు అందజేత, కు టుంబంలో ఎంత మంది ఆడ పిల్లలున్నా నెలకు రూ.1500, ఏటా రూ.15,000లు మం జూరు చేయనున్నట్లు తెలిపారు. రైతులకు రూ.20వేల పెట్టుబడి సాయమందించనున్న ట్లు, నిరుద్యోగులకు రూ.3వేలు మంజూరు, ఏ టా లక్షల్లో ఉపాధి కల్పించనున్న ట్లు చెప్పారు. ఎర్రగొండపా లెం టీ డీపీ అభ్యర్థి ఎరిక్షన్‌బాబుకు సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబును ము ఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా స్వ ర్ణాంద్రప్రదేశ్‌ను రూపొందించు కుందామని అభ్యర్థించారు.