Share News

మూలనపడిన ఎత్తిపోతల పథకం

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:21 PM

వందలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా ఏర్పా టు చేసిన ఎత్తిపోతల పథ కం అధికారుల నిర్లక్ష్యం వ లన ఏళ్ల తరబడి మూలనపడింది. బిగించిన మో టా ర్లు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లు తుప్పుపట్టి పోతున్నా ప ట్టించుకున్న వారే లేరు. మండలంలోని తూర్పువెంకటాపురం పెద్దవాగుపై 2000లో ఎత్తిపోతల పథకం నిర్మించారు. కొద్దిరోజులు పొలాలకు నీరు అందించిన అనతరం పైపులైన్లు లెవల్స్‌ ప్రకారం లేకపోవడంతో అవి దెబ్బతిన్నాయి.

మూలనపడిన ఎత్తిపోతల పథకం
నిర్లక్ష్యం నీడలో ఎత్తిపోతల పథకం

తుప్పుపట్టిపోతున్న సామగ్రి

పట్టించుకోని అధికారులు

ఆందోళనలో రైతులు

దర్శి, జనవరి 1 : వందలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా ఏర్పా టు చేసిన ఎత్తిపోతల పథ కం అధికారుల నిర్లక్ష్యం వ లన ఏళ్ల తరబడి మూలనపడింది. బిగించిన మో టా ర్లు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లు తుప్పుపట్టి పోతున్నా ప ట్టించుకున్న వారే లేరు. మండలంలోని తూర్పువెంకటాపురం పెద్దవాగుపై 2000లో ఎత్తిపోతల పథకం నిర్మించారు. కొద్దిరోజులు పొలాలకు నీరు అందించిన అనతరం పైపులైన్లు లెవల్స్‌ ప్రకారం లేకపోవడంతో అవి దెబ్బతిన్నాయి. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ తాత్కాలిక మరమ్మత్తులు చేశారు. మ ళ్లీ కొద్దిరోజులు నీరందించే ప్ర యత్నం చేసినప్పటికీ విఫలమైంది. పూర్తి స్థా యిలో పైపులైన్లను లెవల్స్‌ ప్ర కారం వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఖర్చు అధికమవుతుందనే ఉద్దేశంతో అ ధికారులు చాలకాలం పట్టిచుకోలేదు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో పా టు నిధుల కొరత వలన మర్మతులకు నోచుకోలేదు. దీంతో ఏకంగా ఎత్తిపోతల పథకం మూలనపడింది. చుట్టుపక్కన సు మారు 200 ఎకరాలకు నీరు అం దించేందుకు ఏర్పాటైన ఈ పథకం మూలన పడడంతో రైతులకు తీరని అ న్యాయం జరిగింది. ఇప్పటికైనా పథకాన్ని పునరుద్ధరించి సాగునీటిని అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jan 01 , 2024 | 11:21 PM